డ్వాక్రా మహిళల కోసం.. జగన్ తాజా లెక్కలు..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా 2029 ఎన్నికలకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. అదే సమయంలో మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. వరుసగా వైఫల్యాల పైన నిలదీస్తున్నారు. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీల పైన ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో అమలు చేసిన ఆర్దిక సహకార పథకాలు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి వైఫల్యం చెందిన తీరు పైన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కూటమి ప్రభుత్వం మహిళలకు మరో వాగ్దాన భంగం చేసిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.
టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. మహిళల చేతిలో నిధులు ఉంటే స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. 'చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందితే మహిళల్లో ఆర్థిక స్వావలంభన చేకూరుతుంది. వారి చేతిలో నిధులుంటే ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రుణాల పెరుగుదల ఆగిపోవటంతో పెట్టుబడులు, ఆదాయాలు తగ్గాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది' అంటూ జగన్ వివరించారు.

ప్రభుత్వం లక్ష్యంగా జగన్ విమర్శలు
దీనికి కొనసాగింపుగా.."2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి -3.22% నెగటివ్‌గా ఉంది. స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ చాలా కీలకమైన పథకం. మా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించాం. అదనంగా ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాం. ఇవన్నీ మహిళలకు స్వయం ఉపాధికి మంచి అవకాశాలుగా మారాయి. టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా చేతులు ఎత్తేసింది"..అని జగన్ లెక్కలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు.













Click it and Unblock the Notifications