అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!!
అమరావతి పై మాజీ సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతికి వ్యతిరేకం కాదని.. అసలు ఖర్చు సాధ్యమేనా అని జగన్ ప్రశ్నించారు. ఈ కారణంగానే ప్రజలు భారం ఉండకూడదని.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదని సంక్షేమం. .డెవలప్ మెంట్ ఆగిపోగకూడదని... మెట్రో నగరాలకు పోటీ పడే ఉండే విధంగా ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉండాలని రాష్ట్రంతో అతి పెద్ద సిటీ విశాఖకు ఆ అవకాశాలు ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చెప్పామని వివరించారు. అమరావతిలో నిర్మాణం కోసం చేస్తున్న ఖర్చల లెక్కలు వివరిస్తూ.. అవినీతికి రాజధానిగా చేసారని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ప్రజా రాజధానిగా చెబుతూ అమరావతిని అవినీతి రాజధానిగా మార్చుతున్నారని ఆరోపించారు. తొలుత 50 వేల ఎకరాలు సేకరించి.. ఇప్పుడు లక్ష ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు రూ 2 వేల కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబే చెప్పారని.. దీని ద్వారా రూ 2 లక్షల కోట్లు మౌలిక వసతులకే ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. తాము అమరావతి సహా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు. అమరావతి కోసం చేస్తున్న అప్పు లు.. టెండర్ల ఖరారు.. చేస్తున్న ఖర్చు పైన జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రెండు లక్షల కోట్ల ఖర్చు స్థోమత మనకు ఉందా అని వ్యాఖ్యానించారు. రెండు లక్షల కోట్ల ఖర్చు మౌలిక వసతుల కోసమే కావాల్సి ఉంటుందని.. ఇంకా బిల్డింగ్ ఖర్చు కోసం నిధులు కావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అమరావతిలో రోడ్లు, కరెంట్, డ్రైనేజ్, మంచి నీరు ఇవ్వటానికి ఇంత ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, డెవలప్ మెంట్ రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతల పరిస్థితి ఏంటని జగన్ ప్రశ్నించారు. అమరావతి పేరిట స్కాంల కోసం ఇంత ఖర్చు చేయటం వలన ఇప్పటికే రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయాయని చెప్పారు. బడులు, ఆస్పత్రులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.

ఆచరణాత్మక ఆలోచనలు చేసాం.. అమరావతికి వ్యతిరేకం కాదు
కాగా, రాజధానిగా అమరావతి రియాల్టీ పక్కన పెడితే దేశంలో అతి పెద్ద స్కాం.. అవినీతికి రాజధాని చేసారని కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి పేరుతో చంద్రబాబు దేశంలోనే అతి పెద్ద అవినీతికి తెర లేపారని ఆరోపించారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ అమరావతిలో జరుగుతుందని విమర్శించారు. ఇది మాఫియా కాదా అని ప్రశ్నించారు. ఫైవ్ స్టార్ హోటల్స్ లోనూ చదరపు అడుగు నిర్మాణం కోసం రూ 4,500 మించి అవసరం ఉండదని.. ఇక్కడ రూ 14 వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అమరావతిలో టవర్ల నిర్మాణం కోసం గతం అంచనాలు.. ఇప్పుడు పెరిగిన రేట్ల పైన జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా అని జగన్ ప్రశ్నించారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో రూ 1100 కోట్లు ఖర్చు చేసారు. తెలంగాణలో రూ 615 కోట్లతో సచివాలయం, పార్లమెంట్ కొత్త భవనం రూ 970 కోట్లతో నిర్మించారని.. అమరావతి లో అసెంబ్లీలో రూ 1,449 కోట్లతో నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ అవినీతి పై ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారని చెప్పారు. అమరావతిలో కౌలు పెంచామని.. ఆచరణాత్మకంగా వ్యవహరించామని జగన్ చెప్పుకొచ్చారు. తనకు సంకుచిత ఆలోచన ఉంటే రాయలసీమలోనే రాజధాని ఖరారు చేసేవాడినని జగన్ పేర్కొన్నారు. తాము ఇచ్చిన ప్లాన్ ఏ నచ్చని చంద్రబాబు.. తాము ప్రతిపాదించిన ప్లాన్ బీ ను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications