జగన్ తొలి సారి, బిగ్ డెసిషన్- వారికే సీట్లు.. కీలక ఆదేశాలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల పై తీర్పు తరువాత షెడ్యూల్ విడుదల కానుంది. కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు.. సమన్వయం పైన ఫోకస్ చేసాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. స్థానిక ఎన్నికల కోసం జగన్ వరుసగా సుదీర్ఘ సమావేశాల నిర్వహణ.. క్షేత్ర స్థాయి వ్యూహాలు.. అభ్యర్ధుల ఖరారు పైనా జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఎప్పుడూ లేని విధంగా జగన్ సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల పైన స్పెషల్ ఫోకస్ చేసారు. జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులు.. సమీకరణాలు.. కూటమి నుంచి పోటీ చేసే వారి అంచనాలకు అనుగుణంగా ఈ సమీక్షలు కొనసాగిస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల విషయంలోనూ సూచనలు అందిస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లు ప్రతీ చోట గెలుపును ప్రతి ష్ఠాత్మకంగా తీసుకోవాలని నిర్దేశిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు బలమైన అభ్యర్థుల ఎంపికే లక్ష్యంగా ఈ ముఖాముఖి (వన్ టు వన్) భేటీలు సాగుతున్నాయి. స్థానిక పోరులో ప్రజాబలం, మంచి నమ్మకద్రోహం చేయని నేపధ్యం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించాలని జగన్ స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఏకపక్షంగా ఉండకూడదని, స్థానిక క్యాడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పలు దఫాలుగా చర్చించిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేయాలని ఆదేశించారు.

జగన్ వరుస సమీక్షలతో
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా, విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించని కొందరు నియోజకవర్గ ఇన్-చార్జ్‌లు.. జిల్లా అధ్యక్షుల తీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనితీరు సరిగ్గా లేని వారిపై కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అధికార కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, పోలీసు కేసులను తట్టుకుని నిలబడేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికోసం జిల్లా స్థాయిలో లీగల్ వార్ రూమ్‌లను ఏర్పాటు చేసి, నామినేషన్ల ప్రక్రియలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు న్యాయ బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సామాజిక వర్గాల వారీగా జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఆశావాహుల పేర్లను సిద్దం చేసి పంపాలని జగన్ సూచించారు. రిజర్వేషన్ల ఖరారు తరువాత ఈ జాబితాల నుంచి పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో.. జగన్ చేస్తున్న కసరత్తు స్థానిక ఎన్నికల్లో ఎంత వరకు కలిసి వస్తుందనేది కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
