రాజధానిపై రెఫరెండం: పెద్దిరెడ్డి, బాబుతో జగన్ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో రిఫరెండం (ప్రజాభిప్రాయసేకరణ) జరపాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అంశంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ సర్కారు పూర్తికాలం కొనసాగదని జోస్యం చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాల్లో ఎంత మేర మాఫీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. అధికారం కోసం ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇష్టారీతిలో హామీలిచ్చారని, తీరా అమలు విషయానికొచ్చేసరికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు.
బాబును కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు వైవీ విశ్వేశ్వర రెడ్డి, అత్తార్ చాంద్ బాషా కలిశారు. అన్ని అంశాల్లో జిల్లాకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం చంద్రబాబు కదిరిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చిస్తున్నారు.
నిరసన కార్యక్రమం విజయవంతం
రుణమాఫీ విషయంలో టీడీపీ వైఖరిని నిరసిస్తూ తాము చేపట్టిన మూడు రోజుల నిరసనలలో భాగంగా.. మొదటి రోజైన గురువారం విజయవంతమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలిపింది. శుక్ర, శనివారాలు కూడా నరకాసర వధ పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరసనలు చేపట్టనుంది.












Click it and Unblock the Notifications