చెత్త పన్ను వసూలు చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏమనాలి..?
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోవడంతో , సీఎం చంద్రబాబు పాలన వైఫల్యాలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి పాలన 30 రోజులు పూర్తయ్యిందని, తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ 35 రోజుల్లో పెన్షన్ డబ్బులు ఇవ్వడం తప్ప మరో పని చేయలేదు.
జగన్‌ను దూషించటం తప్ప ఈ నెల రోజుల్లో ఒక్క పని కూడా చేయలేదని ఆయన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.ఇసుక ఉచితం అన్నారు..అది ఎంత వరకు అయిందో రాష్ట్ర ప్రజలంతా చూశారని ప్రభుత్వాన్ని పేర్ని నాని ఎద్దెవా చేశారు. కాలక్షేపం కోసం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం తప్ప ఒక్కటైనా నిరూపించారా..? ఎన్నికల్లో చంద్రబాబు మాటలు కోటలు దాటాయి.

ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమి లేదని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పారు. మళ్లీ విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు మాట మర్చేశారని ఆయన కొత్త ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు.జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెత్తపన్ను విధిస్తే విమర్శించారు. చెత్త పన్ను కొనసాగిస్తున్న మిమ్మల్ని ఏమనాలి? బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు.
ఇదేనా మీ అనుభవం.. ఇంతకుమించి అని చేయలేరా? ఎన్నికల్లో మాత్రం జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు ఖజానా డబ్బులు లేవని మాటట్లాడుతున్నారు. బాబు సీఎం అయ్యే 48 గంటల ముందు కేంద్రం రూ. 5,600 కోట్లు ఇచ్చిందని అన్నారు. రాబోవు రోజుల్లో చంద్రబాబు అసలు నైజం బయటపడుతుందని , అప్పుడు ఎవరి నిజాయితీపరులో ప్రజలే తెలుసుకుంటారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications