'ఎవరికీ రాని ఐడియా బాబుకు వచ్చింది': వారు ఆంధ్రా నయీంలని ఉదయభాను

జయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారత దేశంలో ఎవరికీ రాని ఐడియా వచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నబాబు మంగళవారం నాడు ఎద్దేవా చేశారు. ప్రతి యువత ఒక మీడియాగా తయారు కావాలని ఆయన అన్నారు. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.

యువత అభిమానించి, అండదండలు చూపిస్తున్న పార్టీ వైసిపి అన్నారు. దోమల పైన దండయాత్ర అనే సరికొత్త ఐడియా చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. అయితే, ప్రజా సమస్యల పైన దండయాత్ర చేసే పార్టీ మాత్రం తమ పార్టీనే అన్నారు.

వైసిపి యువకుల నుంచే ప్రారంభమైందని జక్కంపూడి రాజా అన్నారు. జగన్ విధివిధానాలను యువజన విభాగం క్షేత్రస్థాయిలో ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టిడిపి, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు.

Chandrababu Naidu

ఆంధ్రా నయీంల దందాలు: ఉదయబాను

క్విట్ ఏపీ ఉద్యమం పేరుతో చంద్రబాబును త్వరలోనే తరిమికొట్టే రోజు వస్తుందని వైసిపి నేత సామినేని ఉదయభాను అన్నారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనే విద్యార్థులను జైలులో పెడతామనడం అమానుషమన్నారు. టిడిపి శాసన సభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పుతున్నారన్నారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోడెల శివప్రసాద రావు తనయుడు ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+