జగన్ సంచలన నిర్ణయం.. మైలవరం నియోజవర్గంలో కీలక మార్పు

సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గానికి సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ పరిశీలకుడిని మారుస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ పరిశీలకుడుగా ఉన్న అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పిస్తూ.. ఆయన స్థానంలో కర్రా హర్షారెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం.

అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించి నెలరోజులు పూర్తికాకుండానే ఆయన్ను పదవి నుంచి తొలగించడం సంచలనంగా మారింది. నియోజకవర్గ కార్యకర్తలతో గొడవ కారణంగానే అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించినట్టు తెలుస్తోంది.నియోజకవర్గ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ఫొటోల కంటే పార్టీ పరిశీలకుడైన కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలే పెద్దవిగా పెట్టుకున్నారట.

ysrcp Key changes in Mylavaram Constituency

ఇది కాస్తా టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తం అయిన వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే వైసీపీ అధిష్టానం ఈ విషయం కీలక నిర్ణయం తీసుకుంది. మైలవరం పరిశీలకుడుగా ఉన్న అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డిని తొలగిస్తూ..ఆయన స్థానంలో కర్రా హర్షారెడ్డిని నియమించింది.

వచ్చే ఎన్నికల్లో బీసీ కులానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్‌ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వసంత.. కొద్దిరోజుల క్రితమే టీడీపీలో చేరారు. శుక్రవారం విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో వసంత కృష్ణ ప్రసాద్‌కు చోటు దక్కింది. మైలవరం టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమకు మొండిచేయి ఎదురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+