మెగాస్టార్‌తో అలీ: రాజకీయాల గురించి చర్చించకుండానే..
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. పద్మ విభూషణ్ అవార్డుకు నామినేట్ అయిన నేపథ్యంలో ఆయన ఇంటికి సందర్శకుల తాకిడి పెరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను అభినందిస్తోన్నారు. శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, పలువురు టెక్నీషియన్ల రాకపోకలతో చిరంజీవి నివాసం రద్దీగా మారింది.
చిరంజీవిని కలిసి శుభాకాంక్షలను తెలియజేసిన వారిలో నటుడు బ్రహ్మాజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశి పైడిపల్లి, విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ట, మారుతి, స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, ఎస్ రాధాకృష్ణ (చినబాబు), కృష్ణప్రసాద్, శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్.. మెగాస్టార్‌ను కలిశారు. ఈ మధ్యాహ్నం ఆయన చిరంజీవి ఇంటికి వెళ్లారు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు. టెస్ట్ మ్యాచ్‌లల్లో తాను ధరించే జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చారు. విశాఖపట్నానికి చెందిన కేఎస్ భరత్.. చిరంజీవికి పెద్ద ఫ్యాన్.
తాజాగా- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నటుడు అలీ.. మెగాస్టార్‌ను కలిశారు. శాలువా కప్పి గౌరవించారు. సుమారు 40 నిమిషాల పాటు చిరంజీవి ఇంట్లోనే గడిపారు. సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి. రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.
ప్రస్తుతం చిరంజీవి.. తన కొత్త సినిమా విశ్వంభర షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది.












Click it and Unblock the Notifications