వైసీపీని వీడటం పై తేల్చేసిన బొత్సా, నెక్స్ట్ ఇక..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారింది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ నుంచి పార్టీ మారే వారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. విజయనగరం కేంద్రంగా పెద్ద ఎత్తున వైసీపీ కేడర్ పార్టీ మారుతోంది. ఈ సమయం లోనే బొత్సా సైతం వైసీపీ వీడుతున్నారనే ప్రచారం కొనసాగుతోంది. దీంతో.. స్థానిక ఎన్నికల వేళ బొత్సా ఈ వ్యవహారం పై స్పందించారు. స్పష్టత ఇచ్చారు. వైసీపీ కేడర్ కు కీలక సూచన చేసారు.
వైసీపీ ముఖ్య నేత బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. విజయనగరం జిల్లాలో బొత్సా కుటుంబ సభ్యులు చిన్ని శ్రీను టీడీపీలో చేరారు. ఆ తరువాత జిల్లాలో కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ బాట పట్టారు. అప్పలనాయుడు ను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. వరుస పరిణామాల క్రమం లో బొత్సా స్పందించారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీని వీడుతున్నారని విమర్శించారు. వైసీపీలో ఉన్నప్పుడు కొందరిని తీవ్రంగా విమర్శించిన టీడీపీ నేతలే ఇప్పుడు వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో విమర్శించిన వారినే ఇప్పుడు పార్టీలోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అన్ని గ్రామాల్లో పోటీ చేయాలని బొత్స పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో తాను పార్టీ వీడుతున్నానే వార్తలకు స్పష్టత ఇచ్చారు.

బొత్సా వ్యాఖ్యలతో
బొత్సా పరోక్షంగా తన పైన జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. పుకార్లను నమ్మకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని, అన్ని స్థానాల్లో విజయం లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఏకాభిప్రాయంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వైసీపీ లో పని చేస్తున్న వారు.. అభిమానించే వారు ప్రతి ఒక్కరూ వైయస్ జగన్ సైనికులేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించడంతో సుజల స్రవంతికి నీరు వచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు. రానున్న ప్రభుత్వంలో పార్టీ కోసం పనిచేస్తున్న వారిదే కీలక పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. దీని ద్వారా తాను పార్టీ మారటం లేదనే అంశాన్ని బొత్సా స్పష్టం చేసినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది.













Click it and Unblock the Notifications
