Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ కీలక నిర్ణయం- జగన్ పై మోడీ, షా కోర్టులోకి బంతి..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రతపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రాప్తాడు టూర్ లో జగన్ హెలికాఫ్టర్ వద్దకు భారీ ఎత్తున జనం తరలివచ్చి విండ్ షీల్డ్ ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందన సరిగా లేదని భావిస్తున్న వైసీపీ.. దీనిపై ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు.

మాజీ సీఎం వైయస్ జగన్ భద్రతపై ప్రధాని, కేంద్ర హోంమంత్రులను కలబోతున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కుట్రపూరితంగా వైయస్ జగన్‌కు ఉన్న జెడ్‌ప్లస్ భద్రతను నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు.

ysrcp leader botsa Satyanarayana says to approach pm modi amit shah for ys jagan security

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు మంటగలిశాయని బొత్స ఆరోపించారు. రాజ్యాంగస్పూర్తికి తిలోదకాలు ఇచ్చి, రెడ్‌బుక్ పాలనను సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచి, ప్రజలకు మంచి పాలన అందించాల్సిన ప్రభుత్వాలు దానికి భిన్నంగా ప్రతిపక్షంపై కక్షసాధింపులకు, పోలీసులను ప్రయోగించి అధికార దుర్వినియోగంతో తప్పుడు కేసులు బనాయించేందుకే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నాయన్నారు. ప్రభుత్వ అండతో చట్టాలను చేతుల్లో తీసుకొంటున్నారని, దీనికి తార్కాణమే రామగిరిలో మాజీ సీఎం వైయస్ జగన్ గారికి ఎదురైన భద్రతా వైఫల్యం అన్నారు.

వైయస్ జగన్ కు జెడ్‌ప్లస్ భద్రత ఉందని, కానీ కూటమి ప్రభుత్వం ఆయన ఎక్కడకు వెళ్ళినా కనీస పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేయడం లేదని బొత్స ఆరోపించారు. రామగిరి మండలంలో అధికారబలంతో వైయస్ఆర్‌సీపీ బీసీ నేతను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వైయస్ జగన్ ఆ ప్రాంతానికి వెడితే కూటమి ప్రభుత్వం కనీస భద్రతను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి, జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడికి రాజకీయ దురుద్దేశంతో, ఒక కుతంత్రంతో ప్రభుత్వం భద్రత ఇవ్వడం లేదన్నారు.

ysrcp leader botsa Satyanarayana says to approach pm modi amit shah for ys jagan security

ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదని బొత్స తెలిపారు. వైయస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాది మంది అభిమానులు వస్తారని తెలుసు. అయినా కూడా నిర్లక్ష్యంగా, దురుద్దేశంతో భద్రతా వైఫల్యానికి ప్రభుత్వం ఒడిగట్టిందన్నారు. రామగిరిలో 1100 మంది పోలీసులని హెలిప్యాడ్ వద్దే భద్రత కోసం నియమించామని ప్రభుత్వం చెబుతోందని, టీవీల్లో ఆ సంఘటన సమయంలో వచ్చిన దృశ్యాలను ప్రజలు చూశారన్నారు. అక్కడ కనీసం పదిమంది పోలీసులు ఉన్నట్లు కూడా కనిపించడం లేదన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వాలు చట్టబద్దంగా పనిచేయాలని బొత్స తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో అది మచ్చుకైనా కానరావడం లేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. అనంతపురంలో వైయస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలిపైనా, రాప్తాడ్ మాజీ ఎమ్మెల్యేపైన తప్పుడు కేసులు పెట్టారని, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలపై స్థానికంగా ఉన్న ప్రజలు కడుపుమంటతో ఉన్నారని తెలిపారు.

దీనిని ప్రశ్నించేందుకు వచ్చిన వైయస్ జగన్ పై అభిమానంతో అక్కడికి రావడంతో ప్రభుత్వం కళ్ళు కుట్టినట్లు వ్యవహరించిందన్నారు. హెలిప్యాడ్ చుట్టూ సరైన విధంగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బారికేట్స్ ఏర్పాటు చేయలేదని పోలీసులు తప్పించుకునేలా మాట్లాడుతున్నారన్నారు. అలాంటప్పుడు దీనిపై ఆయనకు ముందుగానే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడిగారు.

ప్రజాస్వామిక విధానాలకు దూరంగా పాలన చేస్తే పొరుగు దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారని బొత్స గుర్తుచేశారు. పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నామని, దానిని ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురవుతుందన్నారు. రామగిరి మాత్రమే కాదు మహానంది, గుంటూరు మిర్చియార్డ్‌ ల్లోనూ ఇదే తరహాలో వైయస్ జగన్ భద్రతను గాలికి వదిలేశారన్నారు. పైగా విండ్‌షీల్డ్‌ దెబ్బతిన్న హెలికాఫ్టర్ ఎలా ఎగిరిందని ప్రశ్నిస్తున్నారన్నారు.

Take a Poll

ఒక వీఐపీని తీసుకువెళ్ళే సందర్భంలో పైలెట్లు ఎలాంటి ప్రొటోకాల్స్ పాటిస్తారో వారికి తెలియదా? ఆమాత్రం ఇంగితజ్ఞానం లేకుండా ఎలా మాట్లాడతారని బొత్స ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా పాలించాలో మ్యానువల్స్ ఉన్నాయని, రాజ్యాంగం, చట్ట ప్రకారం పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం మాత్రం దానిని పూర్తిగా విస్మరించిందన్నారు. టీడీపీ పార్లమెంటరీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయులు ఒక మాజీ సీఎంను పట్టుకుని ప్రోఫెషనల్ కిల్లర్ అని మాట్లాడతారా అని బొత్స ప్రశ్నించారు. సరైన ఆలోచనలతోనే ఇలా మాట్లాడుతున్నారా? విద్యాసంస్థలను నడుపుతున్న ఆయన తండ్రిగారు ఇదేనా తన కుమారుడికి నేర్పిన విజ్ఞత అని అడిగారు.

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని బొత్స తెలిపారు. ఉత్తరాంధ్రలోని చోడవరం షుగర్ ఫ్యాక్టరీ లక్ష టన్నులకు పైగా క్రషింగ్ నిలిపిచోతోందన్నారు. రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదని, కార్మికులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కూలినాలీ చేసుకుని బతికే అనేక మంది పేదలు ఉన్నారని, వారి కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంకు 75 రోజులుగా కూలి డబ్బులు చెల్లించకుండా బకాయి పెట్టారన్నారు.

అత్తిలిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి ముట్టూ టీడీపీ గుండాలు చుట్టుముట్టి, భయబ్రాంతులకు గురి చేశారని బొత్స ఆరోపించారు. పోలీసులను రక్షణ కల్పించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. కారుమూరి నాగేశ్వరరావు పార్టీ ఎంపీటీసీలతో కలిసి ఉప ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారన్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం? పోలీసుల్లో పరివర్తన రావాలన్నారు. చట్టాల కోసం పనిచేయాలే తప్ప, అధికారపార్టీకి చుట్టాలుగా పనిచేయకూడదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+