మా జగన్ సార్ వద్ద పెద్ద లిస్టే ఉంది- బైరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రేంజ్‌లో స్పందిస్తోన్నారు. కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ బహిరంగ సభల్లో చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

కాకినాడ వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలను ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తిప్పికొట్టారు. ఎన్నికల్లో గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేసేంత స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను విమర్శించడం వల్ల తాను గెలుస్తాననే మైండ్ సెట్‌లో పవన్ కల్యాణ్ ఉన్నాడని అన్నారు.

 Byreddy Siddharth Reddy

తన కంటే వయస్సులో రెండు- మూడేళ్లు చిన్నవాడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్నాడని, తాను ఆ స్థాయిని అందుకోలేకపోతున్నానని పవన్ కల్యాణ్ భావిస్తున్నాడని, అది ఈర్ష్యాధ్వేషాలకు దారి తీస్తోందని అన్నారు. వైఎస్ జగన్‌తో పోల్చుకోవడం ఎప్పుడు మానివేస్తే అప్పుడు ఇలాంటి విమర్శలు చేయడని చెప్పారు.

 Byreddy Siddharth Reddy

రాజకీయాల్లో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం పవన్ కల్యాణ్‌కు ఉందని బైరెడ్డి గుర్తు చేశారు. ఒక ప్రూవ్డ్ లీడర్‌గా గుర్తింపు పొందిన తరువాత జగన్‌ను గానీ, మోదీని గానీ, ఇంకెవరినైన గానీ విమర్శించవచ్చని చెప్పారు. వైఎస్ జగన్ ఇప్పటికే రాజకీయంగా తనను తాను నిరూపించుకున్నాడని పేర్కొన్నారు.

రెండుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తనను సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా జగన్ నిరూపించుకున్నాడని బైరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక పార్టీని స్థాపించి, రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది తనలాంటి యువతను నాయకుడిలా తీర్చిదిద్దాడని పేర్కొన్నారు. యువతను ఎంపీపీ, జెడ్‌పీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను చేశాడని చెప్పారు.

 Byreddy Siddharth Reddy

రాజకీయాల్లో తాను సాధించింది చెప్పుకోవడానికి జగన్ వద్ద పెద్ద లిస్టే ఉందని, రాస్తే ఒక పుస్తకమౌతుందని, చెప్పుకొంటే ఒక చరిత్ర అవుతుందని బైరెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ ఏం సాధించాడనేది ఒకసారి చూస్తే- 2014లో ఇద్దరితో పొత్తు, 2019లో నలుగురితో పొత్తు, 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాడని సెటైర్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+