బెజవాడ వచ్చి తంతా: మహిళ నేతపై వైసీపీ నేత నోటి దురుసు, ఆ మహిళలు చేస్తారు: టీడీపీ అనిత
టీవీ చర్చల్లో నేతలు ఆగ్రహావేశాలకు లోనవడం కామన్. అయితే వైసీపీ నేత ఒకరు సహనం కోల్పోయారు. మహిళ నేతపై మాటలతో ప్రతాపం చూపించారు. ఆ కామెంట్లను అందరూ ఖండిస్తున్నారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత కూడా ధ్వజమెత్తారు. మహిళపై ప్రతాపం చూపిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
రెచ్చిపోయిన వైసీపీ నేత శ్రీధర్..
ఏపీ అంశాలపై ఓ టీవీ చానెల్‌లో చర్చ జరుగుతోంది. అన్నీ పార్టీల నుంచి నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో యాంకర్ ప్రశ్నలు వేస్తోండగా.. వారు సమాధానం చెప్తున్నారు. అయితే ఒక అంశంపై వైసీపీ నేత శ్రీధర్ రెచ్చిపోయారు. ఓ మహిళ నేతతో ఆయనకు తరచూ వాగ్వివాదం జరుగుతోంది. చివరకు ఆయనకు ఓపికి నశించి పోయింది. మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పారు. ఆమె వినకపోవడంతో.. ఆపండి.. లేదంటే బెజవాడ వచ్చి తంతా అని కామెంట్ చేశారు. దీంతో డిబేట్ హాట్ హాట్‌గా మారింది.

బెజవాడ మహిళలు చేస్తారు..
అందులో పాల్గొన్న మిగతావారు కూడా ఖండించారు. అయితే డిబేట్ క్లిప్‌ను టీడీపీ అనిత ట్వీట్ చేశారు. శ్రీధర్ వైఖరిని తప్పుపట్టారు. బెజవాడ వచ్చి తంతావా అంటూ ధ్వజమెత్తారు. నీ తల్లి, భార్య, బిడ్డ, సోదరి చేయలేని పనిని బెజవాడ మహిళలు చేస్తారు అంటూ విరుచుకుపడ్డారు. ఓ బజారువాడిలా మాట్లాడవని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. విజయవాడ మహిళలు నీకు సంస్కారం, పద్దతి నేర్పి పంపుతారని అని అనిత చెప్పారు. ఆడవారి మీద ప్రతాపం అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు మీ అధినేత జైలులో ఉన్నప్పుడు పార్టీని కాపాడింది ఎవరూ అని ప్రశ్నించారు. ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు.

16 నెలలు జైలులో..
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 16 నెలలు ఆయన జైలులో ఉండగా.. విజయమ్మ, షర్మిలా, భారతీ.. పార్టీ వ్యవహారాలను, సాక్షి గ్రూపును, వ్యాపారాలను చూసుకున్నారు. జగన్ జైలు నుంచి వచ్చేవరకు ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత నిర్వర్తించారు. ఇలా అందరీలో ధైర్యం నింపుతూ ముందుకుసాగారు. ఈ విషయాన్ని అనిత ప్రస్తావించారు. అలా ముగ్గురు మహిళలను మీ పార్టీని నిలబెడితే మీరు మహిళను తంతా అంటారా అని విరుచుకుపడ్డారు. ఇదీ సరికాదు అని.. దీనిని మహిళా జాతి ఖండిస్తోందని చెప్పారు.
Recommended Video

ఇరకాటంలో వైసీపీ
వైసీపీ నేత శ్రీధర్ కామెంట్స్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. మహిళ నేతపై నోటి దురుసు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీంతో పార్టీకి నష్టమని భావిస్తోంది. దీనిపై పార్టీ వివరణ అడిగినట్టు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications