వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని పోటీ పై కొత్త ట్విస్ట్, తేల్చి చెప్పిన జగన్..!?

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ సమయంలో కూటమి పార్టీల నేతలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. వైసీపీని టార్గెట్ గా చేసుకున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ సైతం పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జగన్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానితో కీలక చర్చలు జరిగాయి. 2029 ఎన్నికల్లో పోటీ పైన నిర్ణయం జరిగింది.

మాజీ సీఎం జగన్ వచ్చే ఏడాది నుంచి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. దీనికి ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల పైన ఒక నిర్ణయానికి రానున్నారు. ఇందు కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగా త్వరలో పార్టీలో చేరికలు ఉంటాయని చెబుతన్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా జగన్ తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా కీలక అంశాల పైన చర్చించారు. 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత కొడాలి నాని నియోజకవర్గానికి దూరం గా ఉంటున్నారు. పార్టీ నేతలతో టచ్ లోనే ఉన్నా... నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పొల్గొనటం లేదు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంత కాలం దూరంగా ఉన్న కొడాలి నాని ఇప్పుడు తిరిగి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తున్నారు. అందు లో భాగంగా తాజాగా జగన్ తో సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్దిగా.. మోదీ మార్క్ నిర్ణయం - కేంద్ర మంత్రిగానూ..!?
ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్దిగా.. మోదీ మార్క్ నిర్ణయం - కేంద్ర మంత్రిగానూ..!?
ysrcp-leader-kodali-nani-meets-ys-jagan-key-discussions-over-party-situation-in-capital-amaravati

గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ పైనా క్లారిటీ

2024 ఎన్నికల్లో పోటీ తాను చివరగా పోటీ చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడి కుమారుడు పోటీ చేస్తారని కొడాలి నాని గతంలోనే చెప్పారు. అయితే.. 2024 ఎన్నికల్లో ఓడటంతో 2029 లో పోటీ పైనా కొంత డైలమా లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కొడాలి నాని పార్టీ బాధ్యతలకు పరిమితం అవుతారని.. నాని కుటుంబ సభ్యులకు సీటు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జగన్ వద్ద తాజాగా కొడాలి నాని ఇదే అంశం పైన చర్చ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. జగన్ మాత్రం 2029 ఎన్నికల్లో కీలకమైనవి కావటంతో.. నాని పోటీ చేయాలని స్పష్టం చేసినట్లుగా పార్టీ నేతల సమాచారం. కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని..గుడివాడ లో సైతం స్థానికంగా నానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఎక్కువ సమయం నియోజకవర్గానికి కేటాయించాలని... కేడర్ తో మమేకం కావాలని నిర్దేశించారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని తిరిగి ఎన్నికల బరిలో దిగుతారా.. పార్టీ వ్యవహారాలకు పరిమితం అయి.. కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+