కొడాలి నాని మళ్లీ మొదలెట్టేసారు - హెచ్చరిక..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పరాజయం పాలైంది. టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. గత ఫలితాల తరువాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ మద్దతు దారులు వైసీపీ శ్రేణుల పైన దాడులు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ సైతం వీటి పైన స్పందించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని దాడుల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో వైసీపీ శ్రేణి పైన జరుగుతున్న మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి మద్దతు దారులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇంటి పైన దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే వైసిపి ఈ దాడుల పైన గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. టిడిపి నేతలు ఉద్దేశపూర్వకంగానే వైసిపి నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసిందని కొడాలి నాని మండిపడ్డారు. టిడిపి, జనసేన పార్టీ మద్ద ధరలు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడులు జరుగుతున్న పోలీసులు స్పందించడం లేదని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి క్యాడర్ పై జరుగుతున్న దాడుల గురించి హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దాడులు చేసిన వారితోపాటు చూస్తూ ఉన్న పోలీసుల పైన కేసులు వేస్తామన్నారు. రాబోయే రెండు రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామని ప్రకటించారు. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామని, క్యాడర్ ను కాపాడుకుంటామని వెల్లడించారు. తమని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామని.. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కొడాలి నాని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications