• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ అంటే..:

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చేసిన చివరి ఎన్నికలవ్యాఖ్యలపై ఎదురు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనపై కౌంటర్లు వేస్తూనే వస్తోన్నారు. ఇదివరకు మంత్రులు అంబటి రాంబాబు, ఆర్ కే రోజా, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్.. కామెంట్స్ చేశారు.

దింపుడు కళ్లెం ఆశలు..

దింపుడు కళ్లెం ఆశలు..

ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చంద్రబాబు 2019లోనే చివరి ఎన్నికలను ఎదుర్కొన్నాడని, ఆ విషయం ఆయనకు తెలియట్లేదని చెప్పారు. అధికారంలోకి వస్తాననే దింపుడు కళ్లెం ఆశ చంద్రబాబులో ఇంకా మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. దింపుడు కళ్లెం ఆశతోనే అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాము ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా ప్రజలు నమ్మట్లేదనేది చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు స్పష్టంగా తెలిసిపోయిందని అన్నారు.

చేసిన పనులే గీటురాయిగా..

చేసిన పనులే గీటురాయిగా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనలేమనే నిర్ధారణకు వచ్చారని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. తాను చేసిన పనులను గీటురాయిగా పెట్టుకుని వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లనున్నారని, చంద్రబాబు ఏం చెప్పి ఓటర్ల ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. తన పరిపాలన నచ్చితేనే ఓటు వేయండంటూ ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రకటన చేశారని ప్రశంసించారు. అంత ధైర్యం ఎవరికి ఉందని అన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు తానేమి మంచి చేస్తానో చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

లాస్ట్ ఛాన్స్ అంటే..

లాస్ట్ ఛాన్స్ అంటే..

ఏమీ చేయకపోయినా అంతా తానే చేశానని ఊదరగొట్టుకునే చంద్రబాబు కంటే.. చేసింది చెప్పుకొని ప్రజల ముందుకు వెళ్లే జగన్ గొప్పవాడని లక్ష్మీపార్వతి కితాబిచ్చారు. 2024లోనూ జగనే గెలుస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ అంటే ఇదేమైనా పప్పు బెల్లాలా? అని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. పంచుకోవడానికి ఇదేమీ ఆస్తిపాస్తులు కూడా కావని పేర్కొన్నారు.

మేలు చేసే నాయకుడికే..

మేలు చేసే నాయకుడికే..

ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి ముఖ్యమైనవని, తమకు మేలు చేసే నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారని లక్ష్మీపార్వతి చెప్పారు. 2024లో ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలకు బాగా తెలుసని, ఇప్పటికే వారు ఈ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేశారని వ్యాఖ్యానించారు. అమ్మఒడి మొదలుకుని అన్ని సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్లకు వద్దకు చేర్చిన ఘనత జగన్‌కు ఉందని, రాష్ట్రంలో ఆయన పేరే వినిపిస్తోందని అన్నారు. అది తెలిసే చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తూ ఇష్టమొచ్చినట్టుగా బూతులు తిడుతున్నాడని లక్ష్మీపార్వతి చెప్పారు.

మహిళల ఓట్లన్నీ..

మహిళల ఓట్లన్నీ..

రాష్ట్రంలో 51 శాతం ఓట్లు వైసీపీకి ఉన్నాయని, 2024 నాటికి ఈ సంఖ్య పెరుగుతుందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. పచ్చరంగు పూసుకున్న కొందరు మినహా మహిళలందరూ వైసీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు. జాతీయ స్థాయిలో అన్ని సర్వేలు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపాయని గుర్తు చేశారు. చంద్రబాబు చేయించుకున్న సర్వే కూడా వైసీపీ గెలుస్తుందనే తేల్చిందని అన్నారు. అందుకే ఏం చేయాలో అర్థం కాకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడని, ఆత్మరక్షణలో పడ్డాడనేది అర్థమౌతోందని అన్నారు.

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?- లగడపాటి సమాధానం ఇదే..!!2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?- లగడపాటి సమాధానం ఇదే..!!

English summary
YSRCP leader and Telugu Academy Chairperson Lakshmi Parvathi hits back TDP Chief Chandrababu for his last chance comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X