గవర్నర్ కోటాలో మండలికి ఆ ఇద్దరు వైసీపీ నేతలు? మర్రి రాజశేఖర్‌తో పాటు పశ్చిమ నేత పేరు ఖాయం?

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలికి ఎంపిక కాబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లను అగ్ర నాయకత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు శాసనమండలి సభ్యత్వాల కోసం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తోన్న వైసీపీ అధినాయకులు.. తుది జాబితాను ఖాయం చేసినట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజును గవర్నర్ కోటా కింద శాసన మండలికి పంపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

మర్రి రాజశేఖర్ పేరు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యే విడదల రజిని కోసం చిలకలూరి పేట స్థానాన్ని కోల్పోయిన మర్రి రాజశేఖర్‌కు అప్పట్ల ఇచ్చిన హామీ ప్రకారం.. శాసన మండలికి ఎంపిక చేయడం ఖాయమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరో స్థానం కోసం దళిత నేత కొయ్యె మోషేన్ రాజును ఎంపిక చేశారని అంటున్నారు. ఈ రెండు పేర్లతో కూడిన జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే గవర్నర్‌కు అందజేస్తారని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మోషేన్ రాజు ఇదివరకు కాంగ్రెస్‌లో కొనసాగారు.

YSRCP leader Moshen Raju likely to be nominate to Legislative Council in governor quota

యువజన కాంగ్రెస్‌లో చాలాకాలం పాటు పని చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొవ్వూరు నుంచి పోటీ చేశారు. నాటి టీడీపీ అభ్యర్థి టీవీ రామారావు చేతిలో ఓడిపోయారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా పేరుంది. పార్టీ ఆవిర్భావం నుంచీ పని చేస్తోన్న ఆయనకు శాసన మండలి పంపించాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Recommended Video

    YSR 71st Birth Anniversary: ప్రజల గుండెల్లో మహానేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల నివాళి

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+