జగన్ పార్టీ నేత హత్య కేసు: బిజెపి నేత అరెస్ట్

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు అల్లం నరేంద్ర హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

విచారణ అనంతరం మిగితా వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. నెల్లూరుకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అల్లం నరేంద్ర(37) గత డిసెంబర్ 30న దారుణ హత్యకు గురయ్యారు.

YSRCP leader murder case: BJP leader arrested

రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో అతనిపై దాడి చేశారు. వెనకవైపు నుంచి విచక్షణారహితంగా కత్తులతో 26 సార్లు పొడిచారు. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పుంగనూరు పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. చౌడేపల్లి మండల కేంద్రంలోని ఓ తోటలో ఎర్రచందనం దుంగలను నిల్వచేసి వాటిని కర్ణాటక రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో ఉండగా, పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుల నుంచి రూ. 7 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+