పవన్ కు పిచ్చి బాగా ముదిరింది, గాలిలో గెలిచిన.. రోజా సంచలనం..!!
మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. నగరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ - రోజా వ్యాఖ్యల పైన కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. పోలీసులకు ఫిర్యాదులు చేసారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే రోజా మరోసారి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కూటమి నేతలను లక్ష్యం గా చేసుకొని రోజా విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే పారిపోతారని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ పైన రోజా ఘాటు వ్యాఖ్యలు చేయటంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.
మాజీ మంత్రి రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచిన గాలి ... అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఒక్కరు కూడా ప్రజలు దగ్గర వెళ్లి ఏం కష్టమో ఆడగరని అన్నారు. రేపు వైసీపీ అధికారం కి వస్తే టీడీపీ, జనసేన నాయకులు హైదరాబాద్ కు కాదు అమెరికాకు పారిపోతారని రోజా హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీకెండ్ నాయకులను సంబోధించారు. ప్రజలకు రేషన్ ఇచ్చే వాహనాలకు డబ్బులు లేవు కానీ.. వీళ్లు మాత్రం హెలికాప్టర్, విమానాలలో తిరుగుతున్నారని విమర్శించారు.

వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వందకు వంద రేట్లు వడ్డీ వేసి చెల్లిస్తామని రోజా ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇక పవన్ కల్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని..ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడు అని రోజా ఎద్దేవా చేశారు. చివరకు సుబ్రమణ్య స్వామి అభిమానిని అంటారని చెప్పుకొచ్చారు. అయితే, ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన జనసేన నేతలు మండి పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఇక.. రోజా అరెస్ట్ ఖాయం అంటూ శాప్ ఛైర్మన్ తాజాగా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల వరుస అరెస్ట్ ల వేళ చిత్తూరు జిల్లా కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications