మళ్లీ మొదలెట్టేసిన రోజా - నేను సిద్దం, ఓపెన్ ఛాలెంజ్..!!
ఏపీలో మెడికల్ కాలేజీల అంశం రాజకీయ వివాదంగా మారింది. మెడికల్ కాలేజీల ను ప్రయివేటు పరం చేస్తే అడ్డుకుంటామని మాజీ సీఎం జగన్ ప్రకటించారు. తాము ప్రయివేటుకు ఇవ్వటం లేదని.. పీపీపీ విధానంలో నిర్మాణం చేస్తామని మంత్రులు చెబుతున్నారు. జగన్ సవాల్ ను తప్పు బడుతున్నారు. జగన్ హయాంలో ఒక్క కాలేజీ మాత్రమే నిర్మించారని చెప్పటాన్ని వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. తాజాగా మహిళా మంత్రులకు వైసీపీ నేత రోజా సవాల్ చేసారు. జగన్ హయాం లో నిర్మించిన కాలేజీలను తాను నిరూపించేందుకు సిద్దమని ప్రకటించారు.
జగన్ హయాంలో రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్దంగా ఉన్నానని, కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తనతో వాటిని పరిశీలించేందుకు రావాలని మాజీ మంత్రి ఆర్కె రోజా సవాల్ విసిరారు. జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, నేడు చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి తెగనమ్మేందుకు సిద్దపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక కూటమి మంత్రులతో ఆయనపై దూషణలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాన్ని అమ్ముకుంటున్న దౌర్భాగ్యపు ప్రభుత్వమిదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఏడు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. వాటిల్లో గత ఏడాదితో కలిపి ఆరు కాలేజీల్లో ఇప్పటికే మెడికల్ విద్య ప్రారంభమయ్యిందని చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో రూ.లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో సహా పప్పూబెల్లాల్లా చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతుంటే, ప్రతిపక్ష నేతగా జగన్ ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై హోంమంత్రి అనిత ఇచ్చిన ప్రజంటేషన్ చూస్తే, ఆమెకు ఉన్న ఫ్రష్టేషన్ కనిపిస్తోందని విమర్శించారు. మంత్రుల కు దమ్మంటే రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంధ్యాల, పాడేరు మెడికల్ కాలేజీలకు వస్తారా అంటూ రోజా ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఎంటే ఎలా ఉంటాయి? ఎలా కట్టాలో ఈ మంత్రులకు చూపించడానికి సిద్దమని చెప్పారు. అనిత హోంమంత్రిగా ఉన్నారా? యాంకర్‌గా ఉన్నారా? అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ షూటింగ్‌లు చేసుకోవడానికి, ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్‌లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు ప్రజలు అధికారాన్ని ఇచ్చిందని మండిపడ్డారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications