కడపలో టిడిపి నేత భాస్కర్‌రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కాల్పులు

కడప జిల్లా వీన్‌పల్లి మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో టిడిపి నేత భాస్కర్‌రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాస్కర్

కడప: కడప జిల్లా వీన్‌పల్లి మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో టిడిపి నేత భాస్కర్‌రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాస్కర్ రెడ్డిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.

భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల మధ్య ఈర్లపల్లి గ్రామంలో చాలా కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది.వీరిద్దరి మధ్య గతంలో అనేక గొడవలు చోటుచేసుకొన్నాయి. అయితే గురువారం నాడు ఇరు వర్గాల మధ్య పంచాయితీ రాజీ విషయమై ఈ ఘటన చోటుచేసుకొందని స్థానికులు చెబుతున్నారు.

Ysrcp leader Srinivas Reddy fired on Tdp leaders Bhaskar Reddy

భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఓ పంచాయితీ విషయంలో రాజీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొందని సమాచారం. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ తరుణంలోనే శ్రీనివాస్ రెడ్డి భాస్కర్‌రెడ్డి పై కాల్పులు జరిపారు. భాస్కర్ రెడ్డితో పాటు ఆయన బంధువు వాసుదేవ రెడ్డిపై శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపారు.

శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ రెడ్డి, వాసుదేవరెడ్డి కాళ్ళపై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితులను వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిని ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఘటన స్థలం నుండి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+