జనసేనలోకి జగన్ సన్నిహిత నేత - పవన్ కీలక హామీ..!!
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత వరుసగా ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పుడు అదే విధంగా జగన్ తో సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి ఇప్పుడు వైసీపీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనాని నుంచి భవిష్యత్ పైన హామీ దక్కినట్లు సమాచారం.
సుచరిత గుడ్ బై..!
వైసీపీకి సీనియర్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ వీడారు. మరి కొందరు అదే బాటలో ఉన్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ మోపిదేవి, బీదా మస్తాన రావు టీడీపీలో చేరారు. జగన్ బంధువు బాలినేని, సామినేని ఇద్దరూ జనసేన కండువా కప్పుకున్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పని చేసిన వాసిరెడ్డి పద్మ సైతం రాజీనామా చేస్తూ జగన్ పైన తీవ్ర విమర్శలు చేసారు. ఇక, మాజీ హోం మంత్రి.. జగన్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే మేకతోటి సుచరిత సైతం పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని సమాచారం.

జగన్ సన్నిహిత నేతగా
సుచరిత 2009 లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 లో జగన్ కోసం రాజీనామా చేసి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. తిరిగి 2014లో ఓడిపోయారు. కాగా, 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో సుచరితకు జగన్ హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయం లోనే కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్ ను కలిసిన తరువాత తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు. ఇక, 2024 ఎన్నికల వేళ సుచరిత ప్రత్తిపాడు కాదని... తాడికొండ నుంచి పోటీ చేసారు. సుచరిత అభ్యర్ధన మేరకే సీటు కేటాయించినా.. అక్కడ ఓడిపోయారు.
జనసేనలోకి ఎంట్రీ
ఇక, సుచరిత ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా రెండు సార్లు గుంటూరుకు వచ్చారు. సుచరిత మాత్రం దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పు పైన ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రత్తిపాడు, తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో, సుచరిత జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలోకి ముఖ్యులతో మంతనాలు పూర్తయినట్లు చెబుతున్నారు. పవన్ నుంచి భవిష్యత్ పైన హామీ ఉందని..వచ్చే వారం జనసేనానితో సమావేశం కానున్నట్లు సమాచారం. దీంతో, సుచరిత తన నిర్ణయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications