బాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లోకేష్ వీడియోలు కావొచ్చు: వైసీపీ నేత సంచలనం

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంశంపై చాలా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వేలు పెట్టారని, తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని కేసీఆర్ చెప్పారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ప్రయత్నాలు చేసి, అందులో విజయం సాధించడమే కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కావొచ్చునని చాలామంది చెబుతున్నారు. ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెస్తారా, ఇదేనా అసలు రిటర్న్ గిఫ్ట్ అని కొందరు చర్చిస్తున్నారు.

వైయస్సార్‌ను దెబ్బకొట్టేందుకు తెరాసతో కలిశారు

వైయస్సార్‌ను దెబ్బకొట్టేందుకు తెరాసతో కలిశారు

ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రిటర్న్ గిఫ్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అన్నారు. తన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా చంద్రబాబు జతకడతారన్నారు. అధికారం కోసం నిన్నటి వరకు బీజేపీతో జతకట్టిన చంద్రబాబు, ఇవాళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. గతంలో వైయస్సార్‌ను ఎదుర్కొంనేందుకు మహాకూటమి అంటూ కేసీఆర్‌తో చంద్రబాబు జట్టుకట్టారన్నారు.

లోకేష్ అక్రమ వ్యవహారాల వీడియోలు

లోకేష్ అక్రమ వ్యవహారాల వీడియోలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరాసతో కలిసి పని చేయాలని కేటీఆర్‌ను చంద్రబాబు కోరారని ద్వారంపూడి మండిపడ్డారు. ఈ సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోవడం వల్లే తెలంగాణనుంచి పారిపోయి వచ్చారన్నారు. ఇటీవల కూకట్‌పల్లిలో లోధియా అపార్టుమెంట్‌లో మంత్రి నారా లోకేష్‌ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను కేసీఆర్‌ త్వరలోనే బయటపెట్టే అవకాశముందన్నారు.

లోకేష్ వీడియోలు బయటపెడతారేమో

లోకేష్ వీడియోలు బయటపెడతారేమో

బహుశా చంద్రబాబు నాయుడికు కేసీఆర్‌ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇదేనేమోనని తన అనుమానం, అభిప్రాయమని ద్వారంపూడి అన్నారు. లోకేష్‌కు చెందిన అక్రమ వీడియోలు బయటపెట్టడమే రిటర్న్ గిఫ్ట్ కావొచ్చునని చెప్పారు. లోకేష్ మంత్రి కాకముందు లోధియా అపార్టుమెంటులోనే ఎక్కువగా ఉండేవారని, అక్కడ అక్రమ వ్యవహారాలు జరిగాయని, అందుకు సంబంధించిన వీడియోలు కేసీఆర్ వద్ద ఉన్నాయేమోనని, వాటిని బయట పెడతారేమోనని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్‌తో జగన్ కలిసి పని చేయడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+