అమెరికా సెక్స్ రాకెట్ వెనుక పెద్దల హస్తం, చంద్రబాబు సమాధానం చెప్పాలి: వాసిరెడ్డి పద్మ
అమరావతి: తెలుగుదేశం పార్టీలోని వ్యక్తులు, పార్టీలోని సన్నిహితులు అమెరికా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ గురువారంసంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీని అత్యంత ప్రమాదకర పార్టీగా పరిగణించాలని విమర్శించారు. అంతర్జాతీయస్థాయిలో తెలుగువారి పరువు పోగొడుతున్నారని నిప్పులు చెరిగారు.

అమెరికా సెక్స్ రాకెట్లో టీడీపీ నేత విచారణపై సమాధానం చెప్పాలి
అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో టీడీపీ నేత విచారణపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తానా అధ్యక్షుడు కోమటి జయరాంను నార్త్ అమెరికాలో తెలుగు ప్రజల ప్రతినిధిగా నియమించారని గుర్తు చేశారు. ఇంత వివాదం నడుస్తుంటే తెలుగు ప్రజల ప్రతినిధి ఏం చేస్తున్నారని నిలదీశారు.

రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు కానీ
కాల్‌మనీ సీఎం అన్నందుకు తమ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చారన్నారు. ఇప్పుడు ప్రతి మహిళ కాల్ మనీ సీఎం అనే స్థాయికి తీసుకు వచ్చారని విమర్శించారు.
Recommended Video


చికాగో సెక్స్ రాకెట్ వెనుక పెద్దల హస్తం
చికాగో సెక్స్ రాకెట్ వెనుక పెద్దల హస్తం ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. తానా అధ్యక్షులు వేమన సతీష్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రశ్నించినట్లుగా తెలుస్తోందని చెప్పారు. వేమన సతీష్.. చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితుడు అన్నారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు.

అమెరికాలోని తెలుగువారి పరువు తీశారు
అమెరికాలో ఉన్న తెలుగువారి పరువు తీశారని వాసిరెడ్డి పద్మ అన్నారు. అమరావతిలో, జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో ఏపీ పరువు తీస్తున్నారన్నారు. కాల్ మనీ కేసులో టీడీపీ నేతలు ఉండటం వల్లే కేసును నీరుగార్చారన్నారు. కాగా, ఇటీవల అమెరికా సెక్స్ రాకెట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications