వైసీపీకి షాక్! .. తెలుగుదేశంలోకి వీరశివారెడ్డి.. నారా లోకేశ్‌తో భేటీ!
వైఎస్సార్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ముహూర్తం చూసుకొని పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిసి శాలువాతో సత్కరించారు.
జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులపై లోకేశ్‌తో చర్చించానని వీరశివారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆసక్తి లేదన్నారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థి కోసం పనిచేస్తానన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వీరశివారెడ్డి టీడీపీలో చేరుతుండటంపై జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో మూడుసార్లు కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వీరశివారెడ్డి తదనంతర రాజకీయ పరిణామాల్లో జగన్ వెంట నడిచారు.

కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో ఉన్నప్పటికీ పదవుల విషయంలోకానీ, ఇతర విషయాల్లోకానీ తగినంత ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో వీరశివారెడ్డి ఉన్నారు. అనుచరులతో చర్చించి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా నుంచి మరికొందరు వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలున్నట్లు సమాచారం. జగన్‌వల్ల చాలామంది అసంతృప్తిగా ఉన్నప్పటికీ వారంతా పైకి చెప్పుకోలేకపోతున్నారని, భవిష్యత్తులో కూడా పదవులు వస్తాయనే నమ్మకం లేనివారిని, నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా ఉన్నవారిని ఆహ్వానించి జగన్‌కు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారు.












Click it and Unblock the Notifications