జగన్ కు భద్రత తగ్గింపు వెనుక..!!

మాజీ సీఎం జగన్ భద్రత పై రాజకీయంగా వివాదం కొనసాగుతోంది. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ కు భద్రత కల్పించకపోవటం పైన వైసీపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. జగన్ సైతం ఇప్పటికే ఈ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల కోడ్ కారణంగా భద్రత కల్పించలేదనే వాదన తో వైసీపీ నేతలు ఏకీభవించటం లేదు. తాజాగా వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్ ను కలిసి జగన్ భద్రత అంశం పైన ఫిర్యాదు చేసారు.

గవర్నర్ కు ఫిర్యాదు
వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్ తో సమావేశం అయ్యారు. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శ కోసం వెళ్లిన సమయంలో జగన్ కు భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేసారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్ తో సంబంధం లేదని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకొనేలా ప్రభుత్వం వ్యవహరించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్సా పేర్కొ న్నారు. మ్యూజికల్ నైట్ కు అడ్డురాని కోడ్.. రైతుల పరామర్శకు వస్తుందా అని ప్రశ్నించారు. ఇక, ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే భద్రత ఇవ్వలేదని ఆరోపించారు.

YSRCP leaders complains to Governor over Lapse of Security in YS Jagan Guntur visit

మ్యూజికల్ నైట్ కు కోడ్ లేదా
జగన్ కు భద్రత ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ విషయం ముందుగా ప్రభుత్వం తెలియచేయాల్సి ఉంద ని చెప్పుకొచ్చారు. తాము భద్రత ఇవ్వలేమని.. రైతులను పరామర్శించేందుకు వెళ్తే ప్రభుత్వం నుంచి భద్రత ఇవ్వమని ముందే చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రైతులకు అమలు చేయాల్సిన అన్నదాత సుఖీభవ ఎందుకు ఇవ్వటం లేదని బొత్సా ప్రశ్నించారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం కు ఒక్క కానిస్టేబుల్ ను కూడా భద్రత కోసం కేటాయించక పోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

జగన్ పై కేసు
జగన్ మిర్చి యార్డు పర్యటనలోనే తన భద్రత అంశం పైన స్పందించారు. చంద్రబాబు లక్ష్యం గా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జగన్ తో సహా పార్టీ నేతలు మిర్చి యార్డు కు వచ్చారంటూ కేసు నమోదు చేసారు. మిర్చి రైతుల అంశం పైన చంద్రబాబు స్పందించక పోతే తాము ఉద్యమం మొదలు పెట్టాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేసారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటన లో ఉన్న సీఎం చంద్రబాబు మిర్చి రైతుల అంశం.. ధరల పైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+