ఉచ్చులో చంద్రబాబు: ఐటీ నోటీసుల వేళ- మరో కంప్లైంట్ ఫైల్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రభుత్వం చేసిన పాపాల వల్లే ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. టీడీపీ చేసిన తప్పులను తమ మీద వేసే కుట్ర చేస్తోన్నారని విమర్శించారు. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో డూప్లికేట్ ఓటర్ల జాబితాను సృష్టించారంటూ ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం నేడు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసింది. వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న నకిలీ ఓటర్లను తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలను కూడా ఎన్నికల ప్రధానాధికారికి అందజేసింది.

అనంతరం పేర్ని నాని విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఒకే పేరు..ఒకే ఐడీ. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల వారికి ఓట్లు ఉన్నాయని వివరించారు. దీన్ని సరి చేయాలని ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు.
2019కు ముందు 59.18 లక్షల ఓట్లను అక్రమంగా జాబితాలో చేర్చారని, ఒక వ్యక్తికి ఏపీతో పాటు తెలంగాణలో ఓటు హక్కు ఉన్న పరిస్థితి ఇప్పటికీ ఉందని పేర్ని నాని అన్నారు. ఓటర్ల జాబితాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదివరకే కోరామని గుర్తు చేశారు.
దొంగ ఓట్లను చేర్చి గెలవాలనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదేనంటూ పేర్ని నాని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు చెందిన 50 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. గజ దొంగే నీతి కబుర్లు చెబుతున్నట్టు.. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications