జగన్ ఆఫీసు ఫర్నీచర్ వివాదంలో కొత్త ట్విస్ట్..!!

ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత పలు అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్‌ టార్గెట్‌గా టీడీపీ చేసిన ట్వీట్‌ తో కొత్త టర్న్ తీసుకుంది. నాడు కోడెల ఎపిసోడ్ ను గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ స్పందించింది. ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే చెల్లిస్తామని వైసీపీ చెబుతోంది.

ఫర్నీచర్ వివాదం
ఏపీలో ఫర్నీచర్ వివాదం హీట్ పెంచుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌ను సచివాలయ ఫర్నిచర్‌తో నింపేశారని, పదవి పోయిన తర్వాత ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి రిటర్న్‌ ఇవ్వకుండా వాడుకుంటున్నారని పేర్కొంది. జగన్‌ ఇంటికి అల్యూమినియం విండోస్‌, డోర్స్‌, ఫ్యాన్లు, లైట్లు, కరెంట్‌ సామాన్లకు రూ.73 లక్షలు ఖర్చు చేశారని.. ఇంటి రెయిన్‌ ప్రూఫ్‌ పీవీసీ పగోడాస్‌, మొబైల్‌ టాయ్‌లెట్స్‌కి రూ.22.50లక్షలు వినియోగించారంటూ అప్పటి జీవో కాపీలను బహిర్గతం చేసింది. ప్రభుత్వం మారిన తరువాత తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

YSRCP leaders says readyy to pay Jagan s Camp Furniture bill to the govt

టీడీపీ విమర్శలు
ఈ వివాదం పైన వైసీపీ స్పందించింది.దిగజారి జగన్‌ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ విమర్శించింది. అటు.. టీడీపీ ట్వీట్లు, ఆ పార్టీ నేతల కామెంట్స్‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం హోదాలో జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. సీఎంగా ఎవరు ఉన్నా.. క్యాంపు ఆఫీస్‌లకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమని గుర్తు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో ఆ జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించారు.

చెల్లించేందుకు సిద్దం
వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్పాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం చెబితే ఆ మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరామని వైసీపీ నేతలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగానే.. సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. వైసీపీ కోరిన విధంగా ప్రభుత్వం ఆ విలువ మొత్తం ఎంతో చెప్పి వసూలు చేస్తుందా.. ఏ విధంగా స్పందిస్తునదేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+