Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్టులు - గెలిచేదెవరు..!?

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాలు ఆసక్తిగా మారుతున్నాయి.

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల చివరి రోజున వైసీపీకి ఏకగ్రీవం కాకుండా అడ్డుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేసింది. పలు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్ధులతో నామినేషన్లు దాఖలు చేయించింది. కానీ, ఒక్క రోజులోనే కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీని అడ్డుకోవాలనే టీడీపీ ప్రయత్నాలు సఫలం కాలేదు.

మొత్తం తొమ్మది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో ఇప్పటి వరకు అయిదు స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. దీంతో, ఈ రెండు రోజుల్లో నాలుగు నియోజకవర్గాల్లో చోటు చేసుకొనే రాజకీయం ఆసక్తి కరంగా మారనుంది. 27న అధికారికంగా ఏకగ్రీవం అయిన స్థానాల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి.

5 స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం..

5 స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం..

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలుపు దిశగా పయనిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ స్థానిక సంస్థల్లో వైసీపీ ఆధిక్యతలో ఉండటంతో..మొత్తం 9 స్థానాలు వైసీపీకే దక్కుతాయనే అంచనాలు ఉన్నాయి. అయితే, వీటిని ఏకగ్రీవంగా గెలుచుకోవాలని వైసీపీ భావించింది. ఇప్పటి వరకు అయిదు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది.

నామినేషన్ల చివరి రోజున అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అభ్యర్దులను బరిలోకి దించింది. కానీ, నామినేషన్ల పరిశీలనలో పలు ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్దుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా ఎన్నికలు జరుగుతన్న తొమ్మది నియోజవకర్గాల్లో అయిదు స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరిలో వైసీపీ ఏకగ్రీవం అయ్యాయి.

నామినేషన్ల పరిశీలనలో కీలక పరిణామాలు

నామినేషన్ల పరిశీలనలో కీలక పరిణామాలు

పలు జిల్లాల్లో నామినేషన్ల పరిశీలనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలో టీడీపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్ధి సంతకాల్లో ఫోర్జరీగా తేల్చిన అధికారులు నామినేషన్ తిరస్కరించారు. దీంతో,కడప నుంచి పీ రామసుబ్బారెడ్డి ఏకగ్రీవం దాదాపు ఖాయమైంది. అనంతపురం జిల్లాలో వైసీపీకి ఏకగ్రీవం కాకుండా అడ్డుకొనేందకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరుడితో నామినేషన్ దాఖలు చేయించారు.

కానీ, నామినేషన్ల స్వతంత్ర అభ్యర్ధి రంగయ్య నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురైంది. ఫలితంగా అక్కడ వైసీపీ అభ్యర్ధి మంగమ్మ ఏకగ్రీవం ఖరారైంది. చిత్తూరులో స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ తిర్కరించటం తో వైసీపీ అభ్యర్ధి సిపాయి సుబ్రమణ్యం ఏకగ్రీవం ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరులో స్వతంత్ర అభ్యర్ధి దేవారెడ్డి నాగేంద్రప్రసాద్ ను బలపర్చిన స్థానిక సంస్థల ప్రతినిధులు సంతకాలు తాము చేయలేదని ఫిర్యాదు చేయటంతో ఆ నామినేషన్ ను తిరస్కరించారు. అక్కడ మేరుగ మురళీధర్ ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది.

27న అధికారిక ప్రకటన

27న అధికారిక ప్రకటన


తూర్పు గోదావరి జిల్లాలో దాఖలైన ఇద్దరి నామినేషన్లను సాంకేతిక కారణాలను తిరస్కరించారు. ఫలితంగా అక్కడ వైసీపీ అభ్యర్ధి కుడిపూడి సూర్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచేందుకు మార్గం సుగమం అయింది. శ్రీకాకుళంలో జిల్లాలో వైసీపీ అభ్యర్ది రామారావుతో పాటుగా మరొకరు బరిలో ఉన్నారు. పశ్చిమ గోదావరిలో రెండు నియోకవర్గాల్లోనూ ఇద్దరు వైసీపీ అభ్యర్ధులతో సహా ఏడుగురు ఇప్పటి వరకు పోటీలో కొనసాగుతున్నారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు పోటీలో నిలిచారు.

ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్నదెవరు..విరమించుకున్నదెవరనేది స్పష్టత రానుంది. ఈ అయిదు స్థానాలే వైసీపీకి ఏకగ్రీవం కానున్నాయా.. ఇంకా ఈ స్థానాల సంఖ్య పెరగనుందా అనేది 27న అధికారికంగా వెల్లడి కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+