ఏపీ ఎన్నికల్లో వారిద్దరి ప్రసంగాలపై నిఘా
Chandrababu Naidu, Pawan Kalyan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార ఉధృతి పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
అదే సమయంలో ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకూ దిగుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తోన్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వారు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి ఎన్నికల అధికారికి ఆధారాలను అందచేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో విజయనగరం జిల్లా నెల్లిమల్ల, రాజంపేట, రైల్వేకోడూరుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమాల్లో వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.
అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి దర్యాప్తు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నప్పటికీ పదే పదే దాన్ని ప్రస్తావిస్తోన్నారని ఈసీకి వివరించారు. ఈ హత్యోదంతం నుంచి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తోన్నారని పేర్కొన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications