ఈసీకి చేరిన టీడీపీ వ్యవహారం
AP Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార ఉధృతి పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైట్లింగ్ అంశాన్ని తెరమీదికి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది వివాదానికి కేంద్ర బిందువు అయింది. కేంద్రం పరిధిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను తమ ప్రభుత్వం అమలు చేస్తోందంటూ టీడీపీ దుష్ప్రచారానికి పాల్పడిందంటూ అధికార వైఎస్ఆర్సీపీ చెబుతోంది.

ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికీ తీసుకెళ్లింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ర్ కాల్స్ ద్వారా ఏపీలో ఏ మాత్రం అమలులో లేని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోందంటూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నాయకుడు శ్రీనివాసరెడ్డి.. ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. టీడీపీ దుష్ప్రచారంపై తగిన ఆధారాలను అందించారు. ఇది- మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కర్నూలు జిల్లా కోడుమూరు, మంత్రాలయంలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అదే సభలో కర్నూలు కూటమి లోక్‌సభ అభ్యర్ది నాగరాజుపైనా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదే రోజున ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుధ్దం వారందరూ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారని, చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications