టిలో జగన్: 13ఎంపీ, 81అసెంబ్లీ, దినేష్‌కు మల్కాజిగిరి

YSRCP Lok Sabha list
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో 13 లోకసభ, 81 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది. జాబితాల మాజీ డిజిపి దినేష్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల పేర్లు ఉన్నాయి. ఐదు సీట్లలో సిపిఎంతో అవగాహన కుదుర్చుకుంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పాలేరు, మధిర, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని నర్సంపేట, భద్రాచలం, మహబూబాబాద్ స్థానాల్లో పార్టీ తన అభ్యర్థులను ప్రకటించలేదు.

జాబితా లోకసభ అభ్యర్థులు

లీలా రాణి ఆదె - అదిలాబాద్
ఎస్ రవీందర్ రెడ్డి - నిజామాబాద్
మీసాల రాజా రెడ్డి - కరీంనగర్
ఎండి మోహియుద్దీన్ - జహీరాబాద్
దినేష్ రెడ్డి - మల్కాజిగిరి
బొడ్డు సాయినాద్ రెడ్డి - హైదరాబాద్
జెట్టి ధర్మరాజు - నాగర్ కర్నూలు
గున్నం నాగిరెడ్డి - నల్గొండ
తెల్లం వెంకట్రావు - మహబూబాబాద్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - ఖమ్మం
హబీబ్ అబ్దుల్ రహమాన్ - మహబూబ్ నగర్
కొండా రాఘవ రెడ్డి - చేవెళ్ల
ప్రభు గౌడ్ - మెదక్

తెలంగాణ బరిలో కిరణ్ పార్టీ

మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తెలంగాణలో 3 లోకసభ, 24 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మంగళవారం తెలంగాణలో 519 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోకసభకు 58 మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటుకు 8 నామినేషన్లు పడ్డాయి. మల్కాజిగిరి అసెంబ్లీకి అత్యధికంగా 11 మంది మంగళవారం నామినేషన్ వేశారు. ఆ తర్వాత బెల్లంపల్లిలో 9 మంది, ఆదిలాబాద్, కామారెడ్డి, చొప్పదండి, ఉప్పల్, గోషామహల్ నియోజకవర్గాలకు 8 మంది చొప్పున నామినేషన్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+