వాలంటీర్లను అరెస్టు చేస్తే ఉరేసుకుంటా ? పవన్ కు వైసీపీ మంత్రి హెచ్చరిక
ఏపీలో వాలంటీర్ల వివాదం నానాటికీ ముదురుతోంది. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా జగన్ సర్కార్ మహిళల వ్యక్తిగత డేటా తీసుకోవడంపై అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైసీపీ కూడా ఎదురుదాడికి దిగుతోంది. తాజాగా తణుకు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను అరెస్టు చేసి జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు. దీనిపై వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు.
వాలంటీర్లను అరెస్టు చేసి జైలుకు పంపితే తాను ఉరేసుకుంటానని పవన్ కళ్యాణ్ ను వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక్క వాలంటీర్ ను అయినా అరెస్టు చేసి జైలుకు పంపితే తాను నిన్న పవన్ వ్యాఖ్యలు చేసిన తణుకు నరేంద్ర సెంటర్లోనే ఉరేసుకుంటానని మంత్రి కారుమూరి హెచ్చరించారు. వాలంటీర్లపై పవన్ కోర్టుకు కూడా వెళ్లొచ్చని ఆయన మరో సూచన చేశారు.

వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కారుమూరి తీవ్రంగా తప్పుబట్టారు. వాలంటీర్లు ఒక్క తప్పు చేసినట్లు నిరూపించినా ఉరేసుకుంటానంటూ కారుమూరి వ్యాఖ్యానించారు. వాలంటీర్లపై, జగన్ పై పవన్ చేస్తున్న వ్యాఖ్యల్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే పవన్ కళ్యాణ్ చదువుతున్నారని మంత్రి విమర్శించారు. మరోవైపు కారుమూరి వ్యాఖ్యలపై జనసేన కూడా స్పందించింది.
వాలంటీర్లను అరెస్ట్ చేస్తే ఊరేసుకుంటా - మంత్రి కారుమూరి..!#KarumuriNageswaraRao #PawanKalyan #APVolunteers #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/vFVIroQZ2W
— oneindiatelugu (@oneindiatelugu) July 15, 2023
వాలంటరీ వ్యవస్ధకు చట్టబద్ధత లేదని, వారు 6 కోట్ల మంది సమాచారాన్ని తీసుకుని జగన్ కుటుంబానికి అందిస్తున్నారని జనసేన నేత పోతిన మహేశ్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి కారుమూరి విసిరిన ఛాలెంజ్ ను మహేశ్ స్వీకరించారు. మంత్రి చేసిన సవాల్ ను స్వీకరించి సాక్ష్యాలతో నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మంత్రి ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పోతిన మహేష్ సూచించారు.












Click it and Unblock the Notifications