సీఎంని చిక్కుల్లో పెట్టిన సీఆర్డీఏ: 'చంద్రబాబు నివాసం కూల్చేయండి'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటున్న అతిథి గృహం అక్రమ కట్టడమని, దానిని కూల్చివేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి శనివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చేసిన ప్రకటన పైనఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని, ముందు దానిని కూల్చివేయండని ధ్వజమెత్తారు.
చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట మీద బాడాబాబులు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలేనని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇవ్వక ముందు ఓ మాట, ఇచ్చాక మరోలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.

గుర్తు పెట్టుకున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అతిథి గృహంలో పని చేస్తున్న ఓ కార్యదర్శి పుట్టిన రోజును గుర్తు పెట్టుకొని శుభాకాంక్షలు తెలిపారు. తద్వారా దగ్గుబాటి రానా నటించిన లీడర్ చిత్రాన్ని గుర్తుకు తెచ్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సతీశ్ చంద్ర సీఎంఓ కార్యదర్శిగా పని చేస్తున్నారు.
ఈయన గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో బాధ్యతలు నిర్వర్తించారు. శుక్రవారం సతీశ్ చంద్ర పుట్టిన రోజు. ఆయన విధులకు హాజరయ్యారు. సతీశ్ చంద్ర పుట్టిన రోజు విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నోరు తీపి చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications