మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఆమెకు వైద్యం చేయించారు. ఆర్కే తన కారులో తాడేపల్లి శివారు మీదుగా వెళ్తున్న సమయంలో.. రెండు బైకులు ఢీకొని ధనలక్ష్మీ అనే మహిళ తలకి తీవ్ర గాయాలైన విషయాన్ని గమనించారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

గతంలో ఓసారి వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పట్ల ఇలాగే మానవత్వంతో వ్యవహరించారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో.. మార్గమధ్యలో ఓ రోడ్డు ప్రమాదాన్ని ఆమె గమనించారు.

ysrcp mla alla ramakrishna reddy helps road accident victim

అప్పటికే చంద్రశేఖరరావు అనే వ్యక్తి మృతి చెందగా.. మస్తాన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్వయంగా డాక్టర్ అయిన శ్రీదేవి హుటాహుటిన కారు నుంచి కిందకు దిగి మస్తాన్ వద్దకు పరిగెత్తుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్స్‌కు కాల్ చేసి.. అంబులెన్స్ వచ్చేవరకు అక్కడే ఉన్నారు. సరైన సమయంలో ప్రథమ చికిత్స చేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+