అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల సంతకాల వెనుక - ఇదీ జరిగిందీ..!!

వైసీపీలోని కొందరు సభ్యుల పై స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత మంది సభ్యులు ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారంటూ
సభలో చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా మరి కొన్ని వ్యాఖ్యలు చేసారు. సంతకాలు చేసి సభకు రాని వారి పేర్లను వెల్లడించారు. దీంతో, సంతకాలు.. అయ్యన్న వ్యాఖ్యల పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ఈ వ్యవహారం పైన క్లారిటీ ఇచ్చారు.

సభకు హాజరు కాకుండా
వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు సభకు హాజరు కాకుండా.. సంతకాలు చేయటం పైన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొందరు ఎమ్మెల్యేలు 'దొంగల్లా వచ్చి వెళ్తున్నారు. మిమ్మల్ని ప్రజలెన్నుకున్నారు.. మీరంతా ఎమ్మెల్యేలు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏమొచ్చింది? గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలా చేయడం కరెక్టు కాదు. హాజరుపట్టికలో సంతకం చేసి సభకు ముఖం చాటేయడం వారి గౌరవాన్ని తగ్గించింది తప్ప పెంచలేదంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. అసెంబ్లీకి వెళ్లి మా సమస్యలపై మాట్లాడమని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పుకొచ్చారు.

YSRCP MLA Chandra Sekhar clarifies on Signatures in Assembly attendance speaker comments

సంతకాలు చేసి
ఇదే సమయంలో ఎవరికీ కనిపించకుండా కొంత మంది సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. వీరిలో ముఖ్యంగా వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), తాటిపర్తి చంద్రశేఖర్‌ (యర్రగొండపాలెం), వేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) విశ్వేశ్వరరాజు(పాడేరు), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), దాసరి సుధ (బద్వేలు) ఉన్నారని.. వేర్ వేరు తేదీల్లో హాజరుపట్టికలో వారు సంతకాలు చేసిన ట్లు తన దృష్టికి వచ్చిందని స్పీకర్ చెప్పుకు చ్చారు. జనసేన సభ్యుడు కొణతాల రామకృష్ణ స్పంది స్తూ.. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ సభకు రాకుండా సంతకాలు పెట్టడంపై ఎథిక్స్‌ కమిటీ కి నివేదించాలని కోరారు. ఈ విషయం పైన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు.

వైసీపీ వాదన ఇలా
ఈ మేరకు తాటిపర్తి సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసారు. బహుజన శాసన సభ్యులను దొంగ లని సంభోదించడం స్పీకర్ గారి విజ్ఞతకు వదిలేస్తున్నా...,ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్య మంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు,వేలంపాటలో సభ్యులను సరసమైనా ధరతో కొన్నోళ్లు, వైశ్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు,స్పీకర్ ను అడ్డుపెట్టుకొని పార్టీ పక్షనేతను పోటు పొడిచినోళ్లు, జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని దోచినోళ్లని స్పీకర్ గారు తెలుసుకోగలరని ఆశిస్తున్నా...అంటూ పోస్టు చేసారు. దీనికి కొనసాగింపుగా.. మేమేమీ గోడలు దూకి, అర్ధరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు...మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందు కు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు...అని తాటిపర్తి ఎక్స్ ఖాతాలో పోస్టు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+