Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‍ని కల్సిన 2వరోజే షాక్: బాబు సమక్షంలో టీడీపీలోకి డేవిడ్‌రాజు

విజయవాడ: తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ పుచ్చుకున్నారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఆదివారం ఉదయం టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

YSRCP MLA Devid Raju joined in TDP

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు, మంత్రి శిద్దా రాఘవరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, పార్టీ వీడనని చెప్పిన రెండో రోజే డేవిడ్ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం గమనార్హం. దీంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలతో సీరియస్‌గా చర్చించాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్‌ నేతలను ఆదేశించారు.

కాగా, డేవిడ్‌ రాజు శుక్రవారం జగన్‌ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారవద్దని సూచించారు. జరిగి 48 గంటల్లోనే రాజు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీలోకి చేరటం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+