అసెంబ్లీలో రఘురామ చర్చ- రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే- ఆ తర్వాత వెనక్కి

ఏపీ అసెంబ్లీ ఒక్కరోజు బడ్జెట్ సమావేశం సందర్భంగా వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామరాజు వ్యవహారం సభలో ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మాట్లాడుతూ రఘురామ ప్రస్తావన తెచ్చారు. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే చివర్లో మాత్రం తోటి ఎమ్మెల్యేలకు షాకిచ్చారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.ఇందులో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలు రెబెల్‌ ఎంపీ రఘురామరాజు ప్రస్తావన తెచ్చారు. కృష్ణాజిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ కూడా రఘురామపై తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. పార్టీ గుర్తు, నాయకుడి ఫొటోతో రఘురామ గెలిచారని, ఆయన రాజీనామా చేస్తే వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని వ్యాఖ్యానించారు. రఘురామ అరెస్టు, బెయిల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో జోగి రమేష్‌ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ysrcp mla jogi ramesh fire on raghurama raju in assembly, after that realises mistake

అయితే రఘురామపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జోగి రమేష్ చివర్లో మాత్రం తోటి ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. తన ప్రసంగం చివర్లో వేరే సభలో సభ్యుడి గురించి ఈ అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని, తాను మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని ఆయన స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. దీంతో ఆయన పరిశీలిస్తానని చెప్పారు. అప్పటివరకూ రఘురామపై ఏకధాటిగా విమర్శలు చేసి చివర్లో రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను జోగి రమేష్‌ కోరడం చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+