వైసిపికి షాక్, కాకాని మెడకు ఉచ్చు: రంగంలోకి ఈడీ, ఎమ్మెల్యే పదవికి చిక్కు?

టిడిపి నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన ఫోర్జరీ పత్రాల వ్యవహారం వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకు చుట్టుకుంది.సోమిరెడ్డిని ఎదుర్కోవడానికి ఆయన చేసిన ప్రయత్నం బెడిస

నెల్లూరు: టిడిపి నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన ఫోర్జరీ పత్రాల వ్యవహారం వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకు చుట్టుకుంది.

సోమిరెడ్డిని ఎదుర్కోవడానికి ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని అంటున్నారు. ఇప్పుడు ఆయన పదవికి ఎసరు తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

Recommended Video

    TDP MLC Somireddy meets DGP, seeks action against MLA Kakani - Oneindia Telugu

    కాకానిపై పోలీసుల ఛార్జీషీట్

    కాకానిపై పోలీసుల ఛార్జీషీట్

    సోమిరెడ్డిపై ఫోర్జరీ పత్రాల ఆధారంగా ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిపై పోలీసులు ఛార్జీషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాకాని తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేసియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు.

    కాకాని-సోమిరెడ్డి వ్యవహారంపై కేంద్ర దర్యాఫ్తు సంస్థల ఆరా

    కాకాని-సోమిరెడ్డి వ్యవహారంపై కేంద్ర దర్యాఫ్తు సంస్థల ఆరా

    తాజాగా, కాకాని గోవర్ధన్ రెడ్డికి, వైసిపికి మరింత షాక్ తగిలే విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా విభాగం, విదేశీ వ్యవహారాల సంబంధ శాఖ కూడా దృష్టి సారించింది. సోమిరెడ్డి నాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర నిఘా విభాగం, విదేశీ వ్యవహారాల శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. కాకాని కూడా ఫిర్యాదు చేశారు.

    కాకానికి ఉచ్చు బిగుస్తోందా?

    కాకానికి ఉచ్చు బిగుస్తోందా?

    కేంద్ర నిఘా విభాగం అధికారులు పలు పత్రాలను సేకరించారని, పలువురిని విచారించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అవి ఫోర్జరీ పత్రాలు అని తెలుస్తుండటంతో కాకానికి ఉచ్చు బిగుస్తోందనే ప్రచారం సాగుతోంది.

    ఫోర్జరీ పత్రాలుగా తేల్చారు

    ఫోర్జరీ పత్రాలుగా తేల్చారు

    సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని, ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన పత్రాలను చూపుతూ కాకాని ఆరోపణలు చేశారు. ఇందులో వాస్తవం లేదని, విచారించి చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబరు 28వ తేదీన సోమిరెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఫోర్జరీ పత్రాలుగా తేల్చారు. ఈ కేసులో కాకాణి గోవర్థన్‌రెడ్డిని మొదటి నిందితుడిగా ఛార్జీషీటులో చేర్చారు. ఇతనితో పాటు ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన వారిని కూడా నిందితులుగా పోలీసులు ఛార్జీషీటులో పేర్కొన్నారు.

    కాకాని పదవిపై వేటుకు సోమిరెడ్డి ఫిర్యాదు చేయనున్నారు

    కాకాని పదవిపై వేటుకు సోమిరెడ్డి ఫిర్యాదు చేయనున్నారు

    అంతేకాదు, కేసు నమోదు, ఫోర్జరీ పత్రాలపై ఛార్జీషీటు నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని శాసనసభ దృష్టికి సోమిరెడ్డి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు సభాపతి కోడెల శివప్రసాద రావును కలిసి కాకానిపై నమోదైన కేసుల వివరాలను కూడా అందించనున్నట్లుగా తెలుస్తోంది. వాటి ఆధారంగా ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే కాకాని, జగన్‌కు, వైసిపికి షాక్ అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+