'అది అసాధ్యం, పార్టీ మారరు': పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా టైగర్‌

తిరుపతి: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీలోకి చేరతారని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై చిత్తూరు జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి స్పందించారు.

ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చిత్తూరు జిల్లా టైగర్‌గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ పట్టు సాధించలేకపోయారని విమర్శించారు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానిస్తే తప్ప జిల్లాలో పట్టుసాధించలేమని భావించిన చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీలోకి వస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ysrcp mla kalathur narayana swamy slams tdp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీనుడైన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని అన్నారు. అయితే అటు సూర్యుడు ఇటు పొడిచినా పెద్దిరెడ్డి టీడీపీలోకి చేరడం అసాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు. వైపీసీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే.... వైయస్ జగన్ ఫోటోతో గెలిచిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆయన సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు రాబోయే ఎన్నికల్లో మైనార్టీలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. మరోవైపు తన గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఎవరని, ఆయన చెబితే పార్టీ మారుతామా, నా వ్యక్తిత్వం నాకు ఉందని పుంగనూరు ఎమ్మెల్యే, వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+