స్పీకర్ శాసనసభకా లేక టీడీపీకా: కోడెలపై కోటంరెడ్డి ఫైర్

Ysrcp mla kotamreddy sridhar reddy fires on speaker kodela
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోటంరెట్టి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. శాసనసభ మొత్తానికి స్పీకర్ గా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి స్పీకర్ గా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర శాసనసభను తెలుగుదేశం పార్టీ కార్యలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా మార్చారని ఆయన విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని స్పీకర్ పదే పదే అడ్డుకుంటున్నారన్నారు.

అంతక ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావుపై వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా జగన్‌ మాట్లాడుతూ మీ సహకారంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చాలా కష్టపడుతున్నారని స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్‌ వ్యాఖ్యలపై టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్‌ హుందాతనం కాపాడుకోవాలన్నారు. శాసనసభలో సభ్యులు సమయపాలనకు కట్టుబడి ఉండాలని ఆయన ఓ సందర్భంలో సూచించారు. సభలో సభ్యులందరూ మాట్లాడే హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్న వారికి అధికారపక్షం ఏం చేసినా తప్పుగానే కన్పిస్తుందని, ప్రతిపక్ష నేత తన ధోరణిని మార్చుకుంటే బాగుంటుందనని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు ఉత్సుకత చూపుతుంటే తమపై తప్పుడు వ్యాఖ్యలు చేసి నవ్యాంధ్రప్రదేశ్‌ను అణదొక్కేందుకు యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+