టిడిపిపై బూతులతో రెచ్చిపోయిన వైసిపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శివాలెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ల పైన ఆయన బూతు పదాలతో మండిపడ్డారని వార్తలు వస్తున్నాయి.

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఎమ్మెల్యే, రవీంద్రనాథ్ రెడ్డి శివాలెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ల పైన ఆయన బూతు పదాలతో మండిపడ్డారని వార్తలు వస్తున్నాయి. కడప కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సమావేశానికి రెండు పార్టీల కార్పోరేటర్లతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. దీనిపై టిడిపి కార్పోరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. టిడిపి సభ్యులను అసభ్య పదజాలంతో తిట్టారని అంటున్నారు.

 YSRCP MLA Ravindranath Reddy fires at Telugudesam Party corporators

పలువురు నాయకుల తీరు వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి రావెల కిషోర్ బాబు పైన రెండుమూడుసార్లు విమర్శలు వచ్చాయి. రెండు రోజుల క్రితం ఆయన కొందరు మహిళలతో పరుషంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+