ముదిరిన 'బండ్ల-రోజా' వివాదం: సోషల్ మీడియాలోకి ఎక్కిన ఫోన్ నంబర్..
Recommended Video

హైదరాబాద్: చర్చల పేరిట టీవీ చానెళ్లు పెడుతున్న డిబేట్ కార్యక్రమాలు చూసేవాళ్లకే రోత పుట్టించేలా మారుతున్నాయి. అసలు టాపిక్ విడిచిపెట్టి.. అనవసర విషయాలపై లేనిపోని రాద్దాంతానికి తెరదీస్తున్నాయి.
టీవీ9 వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో రోజా-బండ్ల గణేశ్ మధ్య మాటల యుద్దాన్ని చూస్తే ఈ విషయం నిజమనిపించకమానదు. సిద్దాంత చర్చలు కాస్త వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తుండటంతో చర్చ కార్యక్రమాలు రచ్చగా మారుతున్నాయి.
టీవీ9 చర్చలో.. ప్రస్తావించడానికి కూడా జుగుప్స కలిగించే మాటలతో రోజా-బండ్ల గణేశ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ వీడియోను బండ్ల గణేశ్ తన ట్విట్టర్ ఖాతాలోను పోస్టు చేసుకున్నారు. దానికి కౌంటర్ గా ఇప్పుడు రోజా.. తన సోషల్ మీడియా ఖాతాలో బండ్ల గణేష్ నంబర్ షేర్ చేయడం గమనార్హం.

సాగర్ దొవారి అనే వ్యక్తి చేసిన పోస్టును షేర్ చేసిన రోజా.. దానికి బండ్ల గణేశ్ నంబర్ కూడా జత చేశారు. అయితే కాసేపటికే దాన్ని రోజా డిలీట్ చేసినా.. స్క్రీన్ షాట్స్ రూపంలో అప్పటికే అది వైరల్ అయింది. రోజా షేర్ చేసిన పోస్టులో పవన్ కళ్యాణ్ పై విమర్శలు గమనించవచ్చు.
'ఏ సర్టిఫికెట్ సినిమాల నటుడు పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా వస్తున్నాడంటే.. వాడి బతుకేంటో ఆ పార్టీ కూడా అంతే అని, అది కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమైన పార్టీ' అని పోస్టులో సదరు వ్యక్తి పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications