అఖిలప్రియా! కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలి: రోజా, నీకే తెలివి ఉంటే: జగన్‌పై టిడిపి

మంత్రి అఖిలప్రియపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నిప్పులు చెరిగారు. మీ కుటుంబానికి వైయస్ జగన్ చేసిన త్యాగానికి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలని అఖిలప్రియను ఉద్దేశించి అన్నారు.

నంద్యాల: మంత్రి అఖిలప్రియపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నిప్పులు చెరిగారు. మీ కుటుంబానికి వైయస్ జగన్ చేసిన త్యాగానికి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలని అఖిలప్రియను ఉద్దేశించి అన్నారు.

వారిపై కేసులు పెట్టండి

వారిపై కేసులు పెట్టండి

వైయస్ జగన్ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేతలు విపరీతార్థాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, బొండా ఉమలు గతంలో ఏం మాట్లాడారో గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి వారిపై తొలుత కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఎప్పటికీ వారి చేతుల్లేనే ఉండవని చెప్పారు. వీరు చేసే దిగజారుడు రాజకీయాలకు సమాధానం చెప్పే పరిస్థితి త్వరలో వస్తుందన్నారు.

Recommended Video

    Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
    నీకన్నా వీధి రౌడీలు నయం.. మమ్మల్ని ఎంతకు కొన్నావ్

    నీకన్నా వీధి రౌడీలు నయం.. మమ్మల్ని ఎంతకు కొన్నావ్

    తండ్రి వయసున్న చంద్రబాబును రోడ్డుపై కాల్చి చంపాలని అంటావా?.. నీ కన్నా వీధి రౌడీలే నయమని మంత్రి ఆదినారాయణ.. జగన్‌పై ధ్వజమెత్తారు. వైయస్ చనిపోయిన తర్వాత నీవు సీఎం కావాలనే ఉద్దేశంతో నీకు మద్దతు పలికిన మమ్మల్ని ఎంత డబ్బిచ్చి కొనుక్కున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు.

    ముఖ్యమంత్రి కావాలని..

    ముఖ్యమంత్రి కావాలని..

    ముఖ్యమంత్రి కావాలన్న తపనతో పిచ్చెక్కి జగన్ మాట్లాడుతున్నారని ఆది అన్నారు. నీవు గోలీలు ఆడుకునే వయసులో నీ తాత, తండ్రి చేసిన అరాచకాల చరిత్ర నీకు తెలియదా? అన్నారు. వైసిపికి చెందిన భూమన, బొత్స, రోజాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు నంద్యాలలోనే తిష్ట వేశారని, అధికార పార్టీకి చెందిన నేతలు మాత్రం ప్రచారానికి రాకూడదా? అని ప్రశ్నించారు.

    అప్పుడు రాజీనామాలు కోరలేదేం

    అప్పుడు రాజీనామాలు కోరలేదేం

    కాంగ్రెస్ పార్టీలో గెలిచి వైసిపిలోకి వచ్చినప్పుడు రాజీనామాలు ఎందుకు కోరలేదని జగన్‌ను ఆదినారాయణ ప్రశ్నించారు. అప్పుడు లేని నైతికత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అన్నారు. నీకు నైతికత ఉంటే ముందు నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచనను రాజీనాయా చేయించాలన్నారు.

    చెన్నారెడ్డిని దించేందుకు హత్యలు చేయించారు

    చెన్నారెడ్డిని దించేందుకు హత్యలు చేయించారు

    చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు హైదరాబాదులో ఎన్ని హత్యలు చేయించారో గుర్తులేదా? అని ప్రశ్నించారు. నీకు అన్ని తెలివితేటలు ఉంటే ప్రశాంత్ కిషోర్‌ను ఎందుకు తెచ్చుకున్నావని నిలదీశారు. కేసుల్లో చిక్కుకుపోయి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావన్నారు. జగన్ ఓ జగత్ కంత్రీ అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+