మహేష్ బాబు డైలాగ్, పవన్ కళ్యాణ్ ప్రచారంతో లోకేష్ దుమ్ముదులిపిన రోజా
అమరావతి: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. లోకేష్ తీరు చూస్తుంటే హీరో మహేష్ బాబు సినిమా డైలాగ్ గుర్తుకు వస్తోందని, కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టినట్లుగా ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు.
ప్రజల కష్టాలపై పోరాడుతున్న తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ముందే ముందే లోకేష్ తొడకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ పైన లోకేష్ తన స్థాయిని మించి వ్యాఖ్యలు చేస్తున్నారని, లోకేష్ సిమ్ కార్డులేని సెల్‌ఫోన్‌లా ఉంటాడని ఎద్దేవా చేశారు.

లోకేష్‌కు బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అన్నారు. కనీసం మండల కమిటీని ఎలా నియమిస్తారో కూడా తెలియని లోకేష్ టీడీపీ జాతీయ కార్యదర్శి కావడం విడ్డూరమన్నారు. కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవని వాడిని, నిన్ను చూసి జగన్ భయపడాలా అని నిలదీశారు.
నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ అందరూ కలిస్తే టిడిపి గెలిచిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోతారన్నారు. అసెంబ్లీ నుంచి తనను అన్యాయంగా పంపించేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి తర్వాత విదేశాల్లో సెటిలైపోతారన్నారు.
కమీషన్లకు ముద్దుబిడ్డ చంద్రబాబు అని ఆమె అన్నారు. ఆయన పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చీటింగ్‌కు చీర్‌గర్ల్ లాంటి ప్రమోటర్ చంద్రబాబు అని రోజా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ చూపించి, ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications