వైసీపీ ఎమ్మెల్యే అల్టిమేటం - మంత్రి సమక్షంలోనే : వైసీపీలో కలకలం..!!

వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యే తన మనసులోని అసహనాన్ని బయట పెట్టారు. మంత్రులు..అధికారులు మారినా నియోజకవర్గంలో పనులు మాత్రం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి తీరును తప్పుబట్టారు. పనులు పూర్తి కాకుంటే ఉద్యమం తప్పదని అధికార పార్టీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలనం

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలనం


వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. గతంలో నియోజకవర్గ సమస్యలపైన పలు రకాలుగా ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. ఇప్పుడు జిల్లా అభివృద్ధిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులు..జిల్లా ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే అధికారుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావటం లేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో మంత్రులు మారుతున్నారు..శాఖలు మారుతున్నాయి.. అధికారులు మారారు, కానీ, పనులు మాత్రం పూర్తి కావటం లేదని ఆగ్రహం వ్యక్తంచేసారు.

మంత్రులు మారినా పరిస్థితి మారలేదు

మంత్రులు మారినా పరిస్థితి మారలేదు


తాను నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినా..అధికారులు ఇప్పటి వరకు వాటిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. జగనన్న కాలనీలో పనులు సాగటం లేదన్నారు. ఉండటానికి వీలుగా లేవని పేర్కొన్నారు. ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలని నిలదీసారు. అదే సమయంలో ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ తీరు పైన మండిపడ్డారు. తాను రావత్ ను కలవటానికి వెళ్లిన సమయంలో..ఆయన కనీసం మర్యాద పాటించలేని మండిపడ్డారు. తానే కర్చున్నా..కనీసం పలకరించలేదని చెప్పుకొచ్చారు.

అధికారులకు అల్టిమేటం

అధికారులకు అల్టిమేటం


ప్రోటోకాల్ ప్రకారం సీఎం, మంత్రుల తరువాత ఎమ్మెల్యేలో ఉంటారనే విషయం ఆయనకు అర్దం అయ్యేలా చెప్పానని..కానీ, తన సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. కొందరు అధికారుల తీరు కారణంగా కాంట్రాక్టర్లకు బిల్లులు రావటం లేదని చెప్పారు. గతంలో మున్సిపల్ మంత్రి బొత్సాతో ఇదే అంశం పైన చర్చించామని.. ఇప్పుడు మంత్రి మారినా..నిధులు మాత్రం మంజూరు కావటం లేదని చెప్పుకొచ్చారు. అధికార సమీక్షలో మంత్రులు.. ప్రజా ప్రతినిధులు.. అధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో.. ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+