''మరోసారి ఇలానే మాట్లాడితే నాలుక కోస్తాం'',ఆయనో జానీవాకర్ రెడ్డి
తమ గురించి అభ్యంతరకరంగా టిడిపి ఎంసి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడితే నాలుకకోస్తామని హెచ్చరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
అమరావతి: టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డిపై వైఎస్ఆర్ సిపి ఘాటుగా స్పందించింది. తమ గురించి అనుచితమైన వ్యాఖ్యలుచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. మరోసారి ఇలానే మాట్లాడితే నాలుక కోస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ జి. శ్రీకాంతో రెడ్డి హెచ్చరించారు.
నాలుగు పెగ్గులేసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని జెసిపై విరుచుకుపడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ శ్రీకాంత్ రెడ్డి. దివాకర్ రెడ్డి కాదు ఆయన పేరు జానీవాకర్ రెడ్డి అంటూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

రాయలసీమ గురించి జెసికి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. తక్షణమే జెసి తన వ్యాఖ్యను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కులమతాలకు అతీతంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు చంద్రబాబు తన చెంబు గ్యాంగ్ తో తిట్టించడం మానుకోవాలని హితవు పలికారు.
జెసి చరిత్ర అంతా దోచుకోవడమేనని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పంచన చేరిన జెసికి కులాల గురించి మాట్లాడే హక్కులేదన్నారు శ్రీకాంత్ రెడ్డి. మరోసారి ఇదే తరహలో మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications