కొణిదెల కుటుంబానికి ఉద్యోగం + భృతి

Nagababu: తెలుగుదేశం పార్టీ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడం దాదాపుగా ఖాయమైనట్టే. ఇప్పటికే ఆయన తమ్ముడు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నాగబాబు శుక్రవారమే నామినేషన్ దాఖలు చేశారు. ఫలితంగా ఆయనకు మంత్రిపదవి లాంఛనప్రాయమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ సహా 10 మంది శాసన సభ్యులు బలపరిచారు.

YSRCP MLA Tatiparthi Chandra Sekhar satirically made remarks Nagababu

వారిలో మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), లోకం నాగ మాధవి (నెల్లిమర్ల), ఆరణి శ్రీనివాసులు (తిరుపతి), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి), సుందరాపు విజయ్ కుమార్ (యలమంచిలి), పీ ధర్మరాజు (ఉంగుటూరు), అరవ శ్రీధర్ (రైల్వే కోడూరు), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), పంతం నానాజీ (కాకినాడ రూరల్) ఉన్నారు.

నామినేషన్లను దాఖలు చేయడానికి తుది గడువు సోమవారమే. 11వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 20వ తేదీన పోలింగ్‌ జరుగుతుంద. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు.

జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్‌ బాబు, యనమల రామకృష్ణుడు పదవి కాలం ఈ నెల 29వ తేదీతో ముగియాల్సి రావడం వల్ల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక అవసరమైంది. శాసన సభలో ఇప్పుడున్న బలాన్ని బట్టి చూస్తే ఈ అయిదు కూడా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఖాతాలోకే వెళ్తాయి. ఆయా ఎన్నిక ప్రక్రియ మొత్తం దాదాపుగా ఏకగ్రీవం అవ్వొచ్చు.

YSRCP MLA Tatiparthi Chandra Sekhar satirically made remarks Nagababu

నాగబాబును కూటమి అభ్యర్థిగా శాసన మండికి ఎంపిక చేయడం పట్ల విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. కుటుంబ రాజకీయాలకు తాను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నానంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన వీడియోలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తవ్వి తీశారు. వైరల్ చేస్తోన్నారు.

దీనిపై తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన యర్రగొండపాలెం శాసన సభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్.. సెటైర్లు వేశారు. మాట ఇచ్చినట్టే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం- కొణిదెల కుటుంబానికి భృతి (అధికారం) ఇచ్చింది, ఉద్యోగం (ఎమ్మెల్సీ) ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇంకా రాష్ట్ర ప్రజల సంగతి అంటారా..విజన్-2047 డాక్యుమెంట్ ప్రకారం 2047 సంవత్సరంలో అవన్నీ కల్పిస్తాం అంటూ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+