పవన్ కళ్యాణ్ వీరాభిమానినిని అందుకే..: వైసిపి ఎమ్మెల్యే అనిల్ యాదవ్
తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాను చూశానని నెల్లూరు సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
నెల్లూరు: తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాను చూశానని నెల్లూరు సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాటమరాయుడు సినిమా చూశారా? అని యాంకర్ ప్రశ్నించగా.. ఫస్ట్ షోనే చూశానని, అందులో తప్పేముందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని, తనకు సినిమా బాగుందా? బాగలేదా అనేది అనవసరమని చెప్పారు. తనకు నచ్చుతుంది అంతే అన్నారు. జానీలాంటి సినిమాయే తాను తొమ్మిదిసార్లు చూశానని చెప్పారు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని చెప్పారు.












Click it and Unblock the Notifications