ఫిర్యాదు: గవర్నర్‌తో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎంపిపి, జడ్పిటిసి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ వారు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జి శ్రీకాంతరెడ్డి, ఎ సురేష్, సి ఆదినారాయణ రెడ్డి, అంజాద్ భాషా, కె శ్రీనివాసులు, వై సాయిప్రసాద్ రెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, కంబాల జోగులు తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం గెలిచిన ఇతర పార్టీ అభ్యర్ధులను ప్రలోభాలకు గురిచేసినా, తమ పార్టీ ప్రజాప్రతినిధులు తమతోనే ఉన్నారన్నారు. అనైతిక విధానాలకు టిడిపి పాల్పడుతోందన్నారు. త్వరలోనే ఎన్నికలు జరుపుతామని గవర్నర్ హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు.

గవర్నర్‌తో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు.

మీడియాతో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

మీడియాతో..
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎంపిపి, జడ్పిటిసి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ వారు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జి శ్రీకాంతరెడ్డి, ఎ సురేష్, సి ఆదినారాయణ రెడ్డి, అంజాద్ భాషా, కె శ్రీనివాసులు, వై సాయిప్రసాద్ రెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, కంబాల జోగులు తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలు
తెలుగుదేశం గెలిచిన ఇతర పార్టీ అభ్యర్ధులను ప్రలోభాలకు గురిచేసినా.. తమ పార్టీ ప్రజాప్రతినిధులు తమతోనే ఉన్నారన్నారు. అనైతిక విధానాలకు టిడిపి పాల్పడుతోందన్నారు.












Click it and Unblock the Notifications