‘పార్టీ వీడి పశ్చాత్తపం: ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’
నెల్లూరు: తమ పార్టీ నుంచి ఎమ్మేల్యేలను కొంటున్నారని ఆరోపిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అంతేగాక, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో అవమానాలకు గురవుతున్నారని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రస్తుతం పశ్చాత్తాపడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, సంజీవయ్య మంళవారం మాట్లాడుతూ చెప్పారు. టిడిపిలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమకు టచ్‌లోనే ఉన్నారని చెప్పారు.
కుట్రతో తెలుగుదేశం పార్టీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయి రెడ్డిదే విజయమని జోస్యం చెప్పారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 17మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించడానికే మహానాడు నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పేదల గుండెల్లో ఉన్న తమ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు.
అంతేగాక, రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేమని స్పష్టం చేశారు.ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం ఏపీ సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications